AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vani Viswanath: ఈ అందాల తార గుర్తుందా? ఆమె కూతురు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఏయే సినిమాల్లో నటించిందంటే?

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది వాణి విశ్వనాథ్‌. తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోందీ అందాల తార. అయితే వాణీ విశ్వనాథ్ కూతురు కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు.

Vani Viswanath: ఈ అందాల తార గుర్తుందా? ఆమె కూతురు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఏయే సినిమాల్లో నటించిందంటే?
Vani Viswanath Daughter
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 8:55 PM

Share

సీనియర్‌ నటి వాణి విశ్వనాథ్‌ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పేరుకు మలయాళ నటినే అయినా తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేసింది వాణీ విశ్వనాత్. ధర్మతేజ, సింహ స్వప్నం, సాహసమే నా ఊపిరి, కొదమ సింహం, మామా అల్లుడు, పరిష్కారం, సర్పయాగం, ఘరానా మొగుడు, సామ్రాట్‌ అశోక, గ్యాంగ్‌ మాస్టర్‌ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది వాణీ విశ్వనాథ్. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిందీ అందాల తార. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా పెళ్లి, పిల్లల కారణంఆ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంది వాణీ విశ్వనాత్. అదే సమయంలో రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ పార్టీలో చేరిన ఆమెగతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే ఎందుకోగానీ మనసు మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవువుతోందీ అందాల తార.

జయ జానకి నాయక సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది వాణీ విశ్వనాథ్. రాజ్ తరుణ్ ఓరేజ్ బుజ్జిగా సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిచింది. సినిమాల సంగతి పక్కన పెడితే వాణి విశ్వనాథ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. వాణి విశ్వనాథ్‌.. మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు బాలు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. 2002లో వీరి పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలున్నారు.

ఇవి కూడా చదవండి

వర్షా విశ్వనాథ్ లేటెస్ట్ ఫొటోస్..

వాణీ విశ్వనాథ్ కూతుర్లలో ఒకరు ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమె ఓవరాల్ గా మూడు సినిమాల్లో నటించింది. .ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? వర్షా విశ్వనాథ్. వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తెనే ఈ అందాల తార. 2022లో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వర్షా విశ్వనాథ్. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీని తర్వాత మలయాళంలో పాథోన్పథం నూట్టండు అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి నటించిన ఫీనిక్స్ సినిమాలోనూ మెరిసిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?