AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు ముచ్చటగా మూడో భర్తతోనూ విడాకులు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం

సినిమా ఇండస్ట్రీలో విడాకులిప్పుడూ సర్వసాధారమైపోయాయి. పెళ్లి చేసుకున్న ఒకటి, రెండేళ్లకే చాలా జంటలు విడిపోతున్నాయి. అదే క్రమంలో ఏళ్ల కొద్దీ కాపురం చేస్తున్న దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ విడాకులు తీసుకుంది. అది కూడా మూడోసారి..

Tollywood: 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు ముచ్చటగా మూడో భర్తతోనూ విడాకులు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం
Actress Meera Vasudevan
Basha Shek
|

Updated on: Nov 17, 2025 | 7:27 PM

Share

సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. గతేడాదే పెళ్లి చేసుకున్న ఈ జోడీ కలిసుండలేమంటూ విడాకులు తీసుకుంది. ‘నేను మీ అభిమాన నటిని.. 2025 ఆగస్టు నుంచి సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ టాలీవుడ్ హీరోయిన్. అంతేకాదు తన పెళ్లి ఫోటోలు, వీడియోలను సైతం సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేసింది. అయితే ఈ హీరోయిన్ ఇలా విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. రెండు సార్లూ విడాకులు తీసుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకుంది. మొత్తానికి గత 20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితోనూ విడిపోయిన ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మీరా వాసుదేవన్. పేరుకు మలయాళ నటి అయినప్పటికీ ఈ అందాల తార తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. గోల్‌మాల్‌ అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా. ఆతర్వాత అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది మీరా. ప్రస్తుతం సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకు ఎదుర్కొంటోంది మీరా వాసుదేవన్. మొదట 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ కుమారుడు విశాల్‌ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది మీరా. కానీ కొన్నేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ నటుడు, విలన్ జాన్‌ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే ఈ జంట కూడా విడిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్‌ విపిన్‌తో లవ్‌లో పడింది. 2024 మేలో కోయంబత్తూరు వేదికగా పెళ్లిపీటలెక్కారు. అయితే ఇప్పుడు ఈ మూడో పెళ్లి కూడా పెటాకులైంది. భర్తతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది మీరా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మీరా వాసుదేవన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మీరా వాసుదేవన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ