Tollywood: ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు టాప్ బిజినెస్ మ్యాన్.. ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్.. ఎవరంటే?
స్టార్ నటుడు, దర్శకుడైన తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు చేశాడు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గతంలో హీరోగా చేసిన చాలా మంది ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో సహాయక నటులుగా రాణిస్తున్నారు. మరికొంతమంది విలన్లుగా మెప్పిస్తున్నారు. ఇంకొంత మంది వ్యాపారవేత్తలుగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తండ్రి స్టార్ నటుడు. ప్రముఖ దర్శకుడు కూడా. నాన్న అడుగుజాడల్లోనే నడుస్తూ 17 ఏళ్లకే కెమెరా ముందుకు వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే లెజెండరీ దర్శకులైన మణిరత్నం, శంకర్ సినిమాల్లో హీరోగా నటించాడు. తన యాక్టింగ్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అప్పట్లో ఈ హీరో జోరు చూస్తే సినిమా ఇండస్ట్రీని ఏలుతాడని భావించారు. కానీ అది జరగలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అవకాశాలు కనుమరుగయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఈ హీరో ఇప్పుడు సహాయక నటుడిగా మెప్పిస్తున్నాడు. అంతేకాదు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నాడు. భారతదేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను మరెవరో కాదు జీన్స్ సినిమా హీరో ప్రశాంత్.
కొన్నేళ్ల క్రితం చెన్నైలోని పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు ప్రశాంత్. దాదాపు 10 అంతస్తులతో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ విస్తరించి ఉంది. భారత దేశంలోని ప్రముఖ నగలు, ఆభరణాల బ్రాండ్‌లకు ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ నిలయంగా ఉంది. అంతేకాదు లగ్జరీ ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడ ఉన్నాయి. ఈ మాల్ నిర్వహణ బాధ్యతలను ప్రశాంత్ తో పాటు అతని సోదరి ప్రీతి త్యాగరాజన్ చూసుకుంటోంది.
నటుడు ప్రశాంత్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్ లో అంధాదూన్ రీమేక్ లో హీరోగా నటించాడు ప్రశాంత్. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే దీని తర్వాత మరో సినిమా చేయలేదు ప్రశాంత్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








