Ravi Teja: చింతూరు ఏజెన్సీలో రవితేజ సినిమా షూటింగ్.. భారీగా తరలివచ్చిన జనాలు.. వీడియో
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహరాజ రవితేజ. ఇటీవల మాస్ జాతర సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ సీనియర్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Ravi Teja New Movie
అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోల్లూరు డొంకరాయి పరిసర ప్రాంతాలలో హీరో రవితేజ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. నటీనటుల రాకతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో రవితేజ, బేబీ నక్షత్ర, పై కొన్ని సన్నివేశాలను డొంకరాయి గ్రామంలో చిత్రీకరించారు. తదుపరి పోల్లూరు ప్రాంతాలలో 20 రోజుల షూటింగ్ కు సంబంధించి శివాలయం వద్ద సెట్స్ వేశారు. రవితేజ సరసన హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్ నటిస్తున్నారు. ఏజెన్సీలో చిత్రీకరణ చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.




