OTT Movie:ఓటీటీ ఆడియెన్స్‌కు బంపరాఫర్.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఫ్రీగా చూసేయండి.. ఐఫోన్ 17 గెల్చుకోండి
ఓటీటీ ఆడియెన్స్ కు బంపరాఫర్. ఇటీవల సూపర్ హిట్ అయిన ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను ఫ్రీగా చూసేయండి. దీంతో పాటు ఐఫోన్ 17ను గెల్చుకునే సూపర్ ఛాన్స్. మరెందుకు ఆలస్యం.. వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ను వెంటనే వీక్షించండి.

ఓటీటీ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు స్ట్రీమింగ్ సంస్థలు పలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసేందుకు ప్రేక్షకులకు బహమతులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఇలాంటి ఆఫర్ నే ప్రకటించింది. ఫ్రీగా వెబ్ సిరీస్ చూసే అవకాశం కల్పించడంతో పాటు ఐఫోన్ ను గిఫ్ట్ గా అందుకునే ఛాన్స్ కల్పించింది. మరి ఆ సిరీస్ ఏంటి? ఐఫోన్ 17 ను ఎలా గెల్చుకోవాలో తెలుసుకుందాం రండి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కానిస్టేబుల్ కనకం అనే ఓ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి రోజు నుంచే ఈ సిరీస్ కు రికార్డు వ్యూస్ వచ్చాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. 1998 ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ రావడం విశేషం.
తాజాగా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఉచితంగా చూసే వెసలుబాటు కల్పించింది ఓటీటీ సంస్థ. ఈ నెల 24, 25, 26 తేదీలలో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. ఇదే క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు ఐఫోన్ 17 గిఫ్టుగా పొందవచ్చు. ఈటీవీ విన్ యాప్‌తోపాటు, సైట్‌లోనూ ఉచితంగా ఈ సిరీస్‌ని ఈ సిరీస్‌ని చూసి, చంద్రిక ఏమైంది? ఆమె కనిపించకుండా పోవడానికి గల కారణాన్ని @etvwin ఎక్స్ ఖాతా/ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు డైరెక్ట్ మెసేజ్ చేయాలని ఆడియెన్స్ ను కోరారు. సరైన సమాధానం పంపిన వారికి ఐఫోన్ 17ను బహుమతిగా అందించనట్టు ఓటీటీ సంస్థ తెలిపింది. మరెందుకు ఆలస్యం.. వెంటనే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కానిస్టేబుల్ కనకం సిరీస్ ను వెంటనే చూసేయండి. ఐఫోన్ 17ను సొంతం చేసుకోండి.
Chandrika has vanished, but the mystery is far from over… 🕵️♀️ Rewatch #ConstableKanakam Season 1 FREE on 24, 25 & 26 October only on @ETVWin, and find the secrets everyone missed the first time! 👀
💡 Crack the mystery. 📩 DM your theory to @etvwin on Instagram or X. 📱 And you… pic.twitter.com/9YRhvI95sJ
— ETV Win (@etvwin) October 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








