AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మెడికల్ కాలేజీలో వరుస మరణాలు.. ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. గుండె దడ పుట్టించే సీన్లు

ఓటీటీలో మీకు మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కావాలినా? అయితే ఈ సినిమా మీకు మంచి ఛాయిస్. ఈ మూవీలోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు కచ్చితంగా మీకు మంచి థ్రిల్ అందజేస్తాయి.

OTT Movie: మెడికల్ కాలేజీలో  వరుస మరణాలు.. ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. గుండె దడ పుట్టించే సీన్లు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 23, 2025 | 9:57 PM

Share

ఓటీటీలో భయపెట్టే హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్. పేరుకు హారర్ థ్రిల్లర్ సినిమానే అయినా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించని సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించారు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచిగానే ఆడింది. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వినిపించాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మున్నార్‌లోని ఒక మెడికల్ కళాశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కాలేజీలో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. మృతదేహాలపై చిత్ర విచిత్రమైన మార్కులు కనిపిస్తుంటాయి. దీంతో కాలేజీలో ఏదో ఉందని అందరూ అనుమానిస్తారు. దీనిని కనిపెట్టేందుకు రూబాన్ ఒక ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్ ను కాలేజీకి పిలిపిస్తారు. అతను కొన్ని సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి ఆత్మలను ట్రాక్ చేస్తాడు. అదే సమయంలో మరణాల వెనక కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ఒక వింత శబ్దం వల్లనే స్టూడెంట్స్ భయపడి చనిపోతున్నారని అర్థం చేసుకుంటాడు.

ఇంతలోనే కాలేజీలో మరో స్టూడెంట్ చనిపోతాడు. రూబాన్ ఆ సౌండ్ ను రికార్డ్ చేసి కాలేజీలో ఆత్మలు ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తాడు. ఆ తర్వాత కాలేజీ గత చరిత్ర గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. 20 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో ఒక మ్యూజిక్ టీచర్ అనుమానాస్పదంగా చనిపోయిందని తెలుసుకుంటాడు. కాలేజీ స్టాఫ్ ఆమెను అన్యాయంగా ఇరికించి చంపేశారని తెలుస్తుంది. ఇంతలోనే మరో స్టూడెంట్ చనిపోతాడు? మరి రూబాన్ ఆ మ్యూజిక టీచర్ ఆత్మను ఎలా అడ్డుకున్నాడు? స్టూడెంట్ ల వరుస మరణాలను ఎలా ఆపగలిగాడు? అసలు ఆ మ్యూజిక్ టీచర కథేంటి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఊహించని ట్విస్టులతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు శబ్దం. టైటిల్ కు తగ్గట్టుగానే ‘సౌండ్’ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, లైలా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. అలాగే రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు ఈ మూవీలో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..