AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పాడుబడిన ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఓటీటీలో హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మెంటలెక్కిపోద్ది

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంటాయి. ఈ తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమా కథ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

OTT Movie: పాడుబడిన ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఓటీటీలో హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మెంటలెక్కిపోద్ది
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 21, 2025 | 7:41 PM

Share

ఓటీటీల్లో కొన్ని జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా హార్రర్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ జానర్ సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగ ఆడలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, దీనికి తోడు ఇదే మూవీ రిలీజ్ సమయంలో మరికొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో ఈ మూవీ థియేటర్లలో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే..విక్రమ్ అనే యువకుడు అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ఊరిలో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. కాలిపోయి పాడుబడిన ఆస్పత్రిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ సీరియల్ మర్డర్స్ వెనక మిస్టరీ తెలుసుకోవాలని విక్రమ్ ఆసక్తి చూపిస్తాడు. అదే సమయంలో ఓ డిటెక్టివ్ కూడా ఈ మిస్టరీ మర్డర్స్ ను విచారిస్తుంటాడు.

ఇద్దరు కలిసి ఆ పాడుబడిన ఆస్పత్రి గతం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఆ ఊరిలో జరిగిన కొన్ని పాత సంఘటనలకు ఈ మర్డర్స్ కు లింక్ ఉందని కనిపెడతారు. మరి ఆ వరుస హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సాగే ఈ సినిమా పేరు అన్వేషి. ఈ మూవీ పాతదే అయినా మంచి హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి ఒక మంచి ఛాయిస్. వి.జే. ఖన్నా తెరకెక్కించిన ఈ మూవీలో తెలుగమ్మాయి అన్వేషి ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. విజయ్ ధరణ్, సింమ్రాన్ గుప్తా, ప్రకాష్ జావేద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అ వుతోంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం