- Telugu News Photo Gallery Cinema photos Actress Nabha Natesh Stunns In Saree On Diwali Festival, See Photos
Nabha Natesh: దీపాల వెలుగుల్లో నభా నటేష్.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
సినిమా సెలబ్రిటీలు తమ దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా తాజాగా హీరోయిన్ నభా నటేష్ కూడా దీపాల వెలుగుల్లో కనిపిస్తూ కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Oct 20, 2025 | 7:15 PM

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు.

సినిమా సెలబ్రిటీలు కూడా దీపావళి వేడుకల్లో భాగమవుతున్నారు. ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు

ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన నభా నటేష్ దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అందంగా చక్కని చీరకట్టులో ఎంతో అందంగా ముస్తాబైందీ అందాల తార.

న దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నభా అందరికీ పండగ విషెస్ చెప్పింది. ఈ ఫొటోల్లో నభా ఎంతో అందంగా కనిపించిందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నభా నటేష్. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.




