ఏం అందంరా బాబు.. బ్యూటిఫుల్ డ్రెసెస్ లో జాన్వీ..
అందాల చిన్నది కుర్రకారు క్రష్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఫ్యాషన్ వీక్ లో తరచూ పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది. అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.
Updated on: Oct 21, 2025 | 2:35 PM

అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మద్దుగుమ్మ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. అతిలోక సుందరి గారాలపట్టీగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

ధడక్ సినిమాతో వెండితెరపై మొదటి సారిగా సందడి చేసి, ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన గ్లామర్, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచి, వరస సినిమాలతో దూసుకెళ్తుంది.

ఇక దేవర సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ లో విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. దీంతో వరసగా తెలగులో ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మధ్య ఫ్యాషన్ వీక్ లో చాలా చురుకుగా పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా విభిన్న రకాల డ్రెస్ లతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాషన్ వీక్ లో భాగంగా మినీ డ్రెస్ లో తన అందాలతో మాయ చేసింది.



