Tollywood : అప్పుడు అతడికి ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పాను.. టాలీవుడ్ హీరోయిన్..
తెలుగులో తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకుని తనదైన ముద్ర వేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ వరుస హిట్లు అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ రాని తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Updated on: Oct 20, 2025 | 1:45 PM

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు అటు స్పెషల్ పాటలతోనూ మెప్పించింది.

అయితే వరుస సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం బ్రేక్ రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను ఓ సందర్భంలో ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందని తెలిపింది. దాదాపు పదేళ్ల క్రితం ఆ ఘటన జరిగిందని తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది రెజీనా.

పదేళ్ల క్రితం బెంగళూరులో అర్దరాత్రి 12 గంటల ప్రాంతంలో తన స్నేహితురాళ్లతో కలిసి వెళ్తుండగా.. తనకు లస్సీ తాగాలనిపించిందని... అప్పుడే క్లోజ్ చేస్తున్న షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానని అన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు.

వెంటనే తాను గర్భంతో ఉన్నానని.. నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని అన్నానని.. తన స్నేహితురాళ్లు సైతం షాకయ్యారని గుర్తుచేసుకుంది. అయితే ఆ షాప్ అతడు ఎక్కడ రెజీనా ప్రెగ్నెంట్ అని అందరికీ చెబుతారో అని తన ఫ్రెండ్స్ సైతం భయపడ్డారని అన్నారు. కానీ లక్కీగా అతడు ఎవరికీ చెప్పలేదని అన్నారు.

తాను ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ ఎన్నో చేశానని.. ఇప్పటికీ చేస్తుంటానని గుర్తు చేసుకున్నారు రెజీనా. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.




