Sir movie: ఎంత పని చేశావన్నా!100 కోట్లు రాబట్టిన సార్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
లక్కీ భాస్కర్ ఫేమ్ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సార్ సినిమా (తమిళంలో వాతి) బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సార్ ఒకటి. తమిళంలో వాతిగా విడుదలైంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్తా మేనన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, రాజేంద్రన్, ఆడుకళం నరేన్, హరీశ్ పేరడి, ఇళవరుసు, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అక్కినేని సుమంత్, డైరెక్టర్ ఇళయ రాజా స్పెషల్ రోల్స్ లో సందడి చేశారు. 2023లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చదువు ప్రాధాన్యాన్ని చెప్పడంతో పాటు ఓ సామాజిక సందేశాన్ని అందించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సార్ సినిమా రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక యాక్టింగ్ లో ధనుష్ అదరగొట్టాడు. సంయుక్త మేనన్ తన గ్లామర్ తో నటనతోనూ ఆకట్టుకుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథ, టేకింగ్ సార్ సినిమాకు భారీ విజయాన్ని అందించాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కు కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.
రవి తేజ వద్దనడంతోనే ధనుష్ దగ్గరకు సార్ సినిమా..
సార్ సినిమాకు హీరోగా ధనుష్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమా కథను మొదట హీరో రవితేజ కోసం సిద్ధం చేసుకున్నారట డైరెక్టర్ వెంకీ అట్లూరి. మాస్ మహారాజాకు కథ కూడా వినిపించారట. అయితే అప్పటికే రవితేజ సినిమా డైరీ ఫుల్ అయిపోయిందట. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో సార్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. దీంతో డైరెక్టర్ వెంకీ హీరో ధనుష్ ను సంప్రదించారట. కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సార్ సినిమా పట్టాలెక్కిందట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. రవితేజ సార్ సినిమా చేసి ఉంటే బాగుండేదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన మిస్ చేసుకున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.
మాస్ జాతర సినిమాలో రవితేజ ,శ్రీలీల..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








