AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్టర్ ప్రేమలో తెలుగు హీరోయిన్..? ఫోటోలు చూసి షాక్ అవుతున్న నెటిజన్స్

సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలే కాదు. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్, డైరెక్టర్ ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డైరెక్టర్ ప్రేమలో తెలుగు హీరోయిన్..? ఫోటోలు చూసి షాక్ అవుతున్న నెటిజన్స్
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 20, 2025 | 5:35 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి హీరో, హీరోయిన్స్ సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఎవరు ప్రేమలో ఉన్నారు, ఎవరితో షికారుకు వెళ్తున్నారు అనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్, డైరెక్టర్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి పండగ జరుపుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?

తెలుగులో ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది నటి ఈషా రెబ్బా. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఈషా రెబ్బ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా.. స్పెషల్ రోల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ప్రేమలో ఉందని వార్తలు చక్కరకొడుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి గతంలో తిరుమలకు వెళ్లారు. అప్పుడు వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక తాజగా ఈ ఇద్దరూ కలిసి దీపావళి జరుపుకున్నారు. విశ్వక్ సేన్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి కనిపించారు. దాంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?