AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70కి పైగా సినిమాల్లో నటించింది.. కట్ చేస్తే వ్యభిచార కేసు.. చివరకు

కొంతమంది హీరోయిన్ ఊహించని విధంగా సినిమాలకు దూరం అవుతుంటారు. మరికొంతమంది చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది చేయని తప్పుకు ఆరోపణలు ఎదుర్కొని సినిమాలకు గుడ్ బై చెప్పారు కూడా.. ఇక్క కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.? 70కి పైగా సినిమాల్లో నటించింది ఆమె..

70కి పైగా సినిమాల్లో నటించింది.. కట్ చేస్తే వ్యభిచార కేసు.. చివరకు
Venkatesh Movie
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2025 | 2:29 PM

Share

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. 1996 లోశ్రీ దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దగ్గుబాటి వెంకటేష్ తో పాటు సౌందర్య, వినీత ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కోటి సమకూర్చారు . ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు , వెంకటేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో సౌందర్యంతో పాటు నటించిన మరో నటి గుర్తుందా.? నేపాలీ అమ్మాయిగా కనిపించిన ఆమె పేరు వినీత. ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.

సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఆమె కెరీర్ ను చేతులారా పడు చేసుకుందని అంటున్నారు. వినీత పేరు అప్పట్లో బాగా పాపులర్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఆమె వ్యభిచార కేసులో చిక్కుకుంది. 2003లో వినీత వ్యభిచార కేసులో చిక్కుకుంది.

2003లో కొందరి ఫిర్యాదుతో వినీత పై పోలీస్లు వ్యభిచార కేసు నమోదు చేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కాగా 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె పై వచ్చిన అభియోగాలను, కేసును కోర్టు కొట్టేసింది. కానీ అప్పటికే ఆమెకు ఆఫర్స్ తగ్గడం మొదలయ్యాయి. ఈ వ్యవహారం తర్వాత ఆమెకు పూర్తిగా సినిమాలు తగ్గిపోయాయి. విచారణ పేరుతో తనను వేధించారని ఆమె పేర్కొన్నారు. కావాలనే తన పేరును నాశనం చేయడానికి పోలీసులు తప్పుడు కేసు పెట్టరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆతర్వాత  వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. దాంతో ఆమె ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆతర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి
Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..