AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత ముద్దుగా ఉందో మావ.! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు.

ఎంత ముద్దుగా ఉందో మావ.! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2025 | 8:29 AM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్‌గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు. అలాంటివారిలో ఈ చిన్నది ఒకరు. మళ్ళీ రావా సినిమా గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సుమంత్ హిట్ అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మడు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. అంత బాగుంది ఆ బ్యూటీ. ఆమె ఎవరంటే..

మళ్లీ రావా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతీ అస్రానీ. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా ఉలిక్కి పడేలా మారింది. మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ నటించిన హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, గోపీచంద్ సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ సైజు టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ సైజు టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!