అతనంటే నాకు పిచ్చి.. సినిమా వస్తే థియేటర్‌కి వెళ్లి విజిల్స్ వెయ్యాల్సిందే..
అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్భూ. 90వ దశకంలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అప్పట్లో ఆమె అందం, అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పుకోవాలి. ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు ఫ్యాన్స్. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఖుష్బూ.. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఖుష్బూ.. ఆతర్వాత చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది . అలాగే మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో ఆమె చిరు అక్కగా కనిపించి ఆకట్టుకున్నారు.
కేవలం సినిమాలతోనే కాదు ఖుష్బూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఖుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటారు.. రెగ్యులర్ గా ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఖుష్బూకు టాలీవుడ్ లో ఓ హీరో అంటే పిచ్చి అభిమానం.. పలు సందర్భాల్లో ఆమె తన అభిమాన తెలుగు నటుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇంతకూ ఖుష్బూ అభిమాన తెలుగు హీరో ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అవును ఖుష్బూకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం..
గతంలో ఖుష్బూ మాట్లాడుతూ.. “నేను జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానిని అభిమానిని. నాకు తారక్ అంటే పిచ్చి. అతని సినిమా విడుదలైందంటే చిన్న పిల్లలాగా థియేటర్ కి వెళ్లి విజిల్స్ వేయాలి, చప్పట్లు కొట్టాలి, పేపర్లు చించి విసిరేయాలంతే.. అతడిపై నా అభిమానం ఇలా ఉంటుంది.. తారక్ నటించిన స్టూడెంట్ నెం 1′ సినిమా చూసినప్పటి నుంచి ఎన్టీఆర్ కి అభిమానిగా మారానని.. అతనితో సినిమా చేయడం నా కల .. ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. గతంలో యమ దొంగ సినిమాలో ఖుష్బూ నటించారు. కాగా ఇప్పుడు ఖుష్బూ చేసిన మెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








