లక్కంటే ఈ అమ్మడిదే..! మొన్న తమ్ముడు. ఇప్పుడు అన్న.. ఇద్దరు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్
అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసింది ఈ వయ్యారి.. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లు చేసింది ఈ అమ్మడు. వీటితో పాటు తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంది.
రాశీ ఖన్నా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో రాశీ రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టిందని టాక్. ఈ సినిమాతో పాటు ఈ అమ్మడి ఇప్పుడు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంటుంది. తెలుసు కదా సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాశీకి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. వీటితో పాటే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మాళవికామోహనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కూడా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఇలా అన్న తమ్ముళ్ళతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది రాశీ ఖన్నా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








