నాలుగేళ్లుగా బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నా..! కమిట్మెంట్స్ అడుగుతున్నారు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్తగా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డుల ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే ఆరుగురిని హౌస్ లోకి వదిలారు. వారిలో దువ్వాడ మాధురి, రమ్య మోక్ష రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి ఎక్కువగా నోటికి పని చెప్తుంది. చిన్నవాటికి పెద్ద వాటికి గొడవపెట్టుకోవడం.. అరవడం, కేకలు వేయడం.. మహారాణిలా రూల్స్ పాస్ చేయడంలాంటివి చేస్తూ హడావిడి చేస్తుంది. అలాగే హౌస్ లోకి వచ్చిన అయేషా మాత్రం తన ఆటతో పాటు ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలో ఉంటే బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది భామలు పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చాలా మంది ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటిస్తుంటే మరికొంతమంది టీవీ షోలు, సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. అయితే ఓ హీరోయిన్ దాదాపు నాలుగేళ్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ప్రయతినిస్తుందట..
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నా అని ఆమె స్వయంగా చెప్పింది. అలాగే ఆమె కమిట్మెంట్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..ఆమె పేరు రేఖ భోజ్.. పలు షార్ట్ ఫిలిమ్స్, కొన్ని సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అలాగే కవర్ సాంగ్ చేశా.. నా బంగారుగాజులు అమ్మి సాంగ్ చేశా.. ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది.
ఆతర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. నాకు ఐదారేళ్లుగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతున్నారు. అలాంటి వారికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చా.. బంగ్లా రాసిస్తా.. అది ఇస్తా.. ఇది ఇస్తా అంటూ ఆఫర్స్ ఇస్తున్నారు. అలాంటివి చేస్తే ఇప్పటికే నేను చాలా సంపాదించేదాన్ని.. నా దగ్గర ఉన్న వస్తువులను అమ్ముకుంటూ నిలదొక్కుకుంటున్నా.. అని చెప్పుకొచ్చింది. నాతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు.. నేనే ఓ సినిమా చేస్తా.. నా కిడ్నీ అమ్మైనా సినిమా చేస్తా.. పాపులారిటీ కోసం బిగ్ బాస్ కు వెళ్లాలని ట్రై చేస్తున్నా.. నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. దాదాపు ఫైనల్ అయ్యాను. మరో వారంలో షో మొదలవుతుందని అనుకునేలోగా నన్ను రిజెక్ట్ చేశారు. ముక్కు మొహం తెలియనని వారిని బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారు. నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే దాన్ని బాగా వాడుకునే దాన్ని.సీజన్ 9కి కూడా ట్రై చేశా కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








