OTT Movie: క్షణ క్షణం భయపెట్టే సీన్స్.. థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్..
గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. క్షణ క్షణం భయపెట్టే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. మరి మీరు ఈ సినిమా చూశారా?

గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీకి భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు చెందినది. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఒక యువకుడు, ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి వెళ్లడం, అక్కడ ఓ మర్దర్ జరిగి ఉండడం.. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఎంతో ఆసక్తిరంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా కథ చిన్నదైనా సస్పెన్స్, డ్రామా, ఎమోషన్స్ ను జోడించి ఎంతో థ్రిల్లింగ్ గా ఈ సినిమాను రూపొందించారు. హీరో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. వస్తున్న జీతం ఏ మాత్రం సరిపోదు. దీంతో ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ ఆడతాడు. కానీ అక్కడ కూడా డబ్బులు పోగొట్టుకుంటాడు. మరోవైపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు ఇలా హీరోను పూర్తి ఇరకాటంలో పడేస్తాయి.
ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి దొంగతనం చేయాలనుకుంటాడు హీరో. తప్పించు కోవడానికి తేలికగా ఉంటుందని వృద్ద దంపతులు ఉండే ఇంట్లోకి వెళతాడు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇంట్లోని ఒక గదిలో ఒక అమ్మాయ శవం ఉంటుంది. దీనిని చూసి బయటకు పారిపోదాం అనుకునేలోపు డోర్ లాక్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఉన్న శవం ఎవరిది ? హీరో దీని నుంచి బయట పడతాడా ? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘ది మాస్క్’ కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారిక ది మాస్క్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
The Mask a thrilling tale of secrets and suspense 😷😳 Unmask the truth today! Streaming NOW on @etvwin 🎬#TheMask #KathaSudha #ETVWin pic.twitter.com/HHUcZxQvT0
— ETV Win (@etvwin) October 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








