Jr NTR- Narne Nithiin: హీరో నార్నే నితిన్ పెళ్లి.. బామ్మర్దికి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏంటో తెలుసా?
టాలీవుడ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఇటీవల పెళ్లిపీటలెక్కారు. శివానీ అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అక్టోబర్ 10 న జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న నార్నే నితిన్- శివానీ అక్టోబర్ 10న పెళ్లిపీటలెక్కారు. అక్టోబర్ 10 రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, కల్యాణ్ రామ్, దగ్గుబాటి వెంకటేష్, రానా, సురేశ్ బాబు, రాజీవ్ కనకాల తదిరులు నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. నార్నే నితిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. కాగా తన బామ్మర్ది పెళ్లి ఏర్పాట్లను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ చూసుకున్నాడట. అంతేకాదు నార్నే నితిన్ కు పెళ్లి కానుకగా ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఒక లగ్జరీ కారును నార్నేనితిన్- శివానీ దంపతులకు పెళ్లి కానుకగా ఇవ్వబోతున్నాడట. ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. కాగా నార్నే నితిన్ పెళ్లిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తనయులు అభయ్, భార్గవ్‌ల సందడి మాములుగా లేదు.
ప్రముఖ బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాసరావు కుమారుడే నార్నె నితిన్. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి సోదరుడు. 2023లో ‘మ్యాడ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయ్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఇటీవలే వార్ 2 సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
బామ్మర్ది పెళ్లిలో అతిథులను ఆహ్వానిస్తోన్న ఎన్టీఆర్.. వీడియో..
Telangana Deputy CM Bhatti Vikramarka garu and #JrNTR @Bhatti_Mallu @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/XPqnS13MC5
— AndhraNTRFC (@AndhraNTRFC) October 10, 2025
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్ రామ్..
Anna family. #JrNTR ❤️🫰🫰🫰🫰🙏🙏🙏 @tarak9999 @DevaraMovie pic.twitter.com/Cv2ioVjY3P
— Ntr anna kurnool fans (@MoinTony) October 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








