AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. తండ్రీ కొడుకులిద్దరితోనూ ఆడిపాడిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

నందమూరి నట సార్వభౌమడుడు ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలతో ఉండే తారక్ నటనలోనూ తాతను మరిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ మ్యాన్ ఆఫ్ మాసెస్.

Jr NTR: హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. తండ్రీ కొడుకులిద్దరితోనూ ఆడిపాడిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Harikrishna, Jr NTR
Basha Shek
|

Updated on: Oct 09, 2025 | 8:37 PM

Share

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హరికృష్ణ, ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోగానూ, సహాయక నటుడిగానూ మెప్పించారు. మోహన్ బాబు శ్రీరాములయ్య సినిమాలో కామ్రేడ్ సత్యంగా నటించిన హరికృష్ణ సీతారామరాజు సినిమాలో నాగార్జునతో కలిసి నటించారు ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేశారు హరికృష్ణ. ఇక సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగించారు. అతి పిన్న వయసులోనే అద్బుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ వరల్డ్ కు పాకింది. కాగా హరికృష్ణ- ఎన్టీఆర్ లతో ఎంతో మంది హీరోయిన్లు కలిసి నటించారు.భానుప్రియ, సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్ వంటి అందాల తారలు హరికృష్ణతో జోడీ కట్టారు. ఇక ఎన్టీఆర్ తో అయితే అమీష పటేల్, సమీరా రెడ్డి, అలియా భట్ వంటి బాలీవుడ్ నటీమణులు కూడా రొమాన్స్ చేశారు. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఈ హీరోలిద్దరితో కలిసి నటించింది. తండ్రీ కొడుకులతో కలిసి ఆడిపాడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి రమ్యకృష్ణ.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది రమ్యకృష్ణ. తారక్ తో కలిసి స్టెప్పులేసింది. అలాగే నా అల్లుడు సినిమాలోనూ ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్‌ లు చేసింది. అంతకు ముందు హరికృష్ణ నటించిన ఒక సినిమాలో కథానాయికగా నటించింది రమ్యకృష్ణ. సముద్ర తెరకెక్కించిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో హరికృష్ణతో కలిసి నటించిందీ అందాల తార. అలా మొత్తానికి తండ్రీ కొడుకులిద్దరితో కలిసి ఆడిపాడిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, రమ్యకృష్ణలది టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రుక్మిణీ వసంత్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు దేవర 2 సినిమాలోనూ తారక్ నటించాల్సి ఉంది.  అలాగే మరికొన్ని సినిమాలకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సీనియర్ నటుల రీయూనియన్ పార్టీలో రమ్యకృష్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC