Brahmamudi: ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ అపర్ణ కూతురును చూశారా? ఆమె కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్
'బ్రహ్మముడి’.. ఇప్పుడు బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోన్న సీరియల్. కార్తీక దీపం-1 తర్వాత బుల్లితెర ప్రేక్షకులను ఆ రేంజ్ లో అలరిస్తోన్న సీరియల్ ఇదేనని చెప్పుకోవచ్చు. ఈ ధారావాహికలో భారీ తారగణమే ఉంది. అందులో రాజ్ (మానస్) తల్లి గా శ్రీప్రియ నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోన్న సీరియల్ బ్రహ్మముడి. బుల్లితెర ఆడియెన్స్ ను అమితంగా అలరిస్తోన్న ఈ సీరియల్ లో మానస్ నాగులపల్లి (రాజ్), దీపికా రంగరాజు (కావ్య) లు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదే సీరియల్ లో అపర్ణా దుగ్గిరాలగా మరో కీలక పాత్ర పోషించింది నటి శ్రీ ప్రియ శ్రీకర్. దుగ్గిరాల ఇంటి పెద్దగా, రాజ్ తల్లిగా ఆమె అభినయం హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో తల్లిగా, కోడలిగా పాజిటివ్ షేడ్స్ చూపిస్తూనే అత్తగా నెగెటివ్ షేడ్స్ కూడా చూపిస్తోంది శ్రీప్రియ. ఒక్క బ్రహ్మముడినే కాదు వైదేహి పరిణయం వంటి దాదాపు 30 సీరియల్స్ లో నటింంచిందీ అందాల తార. కాగా శ్రీప్రియ కూడా ఒకప్పుడు బుల్లితెర హీరోయినే. ఇప్పుడు ఎక్కువగా అత్త, తల్లి పాత్రలతో బాగా ఫేమస్ అయ్యింది. అయితే శ్రీ ప్రియ కూతురు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు.
చిన్నవయసులోనే శ్రీకర్ ను పెళ్లి చేసుకుని సెటిలైంది శ్రీప్రియ. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో ఒకరు ఇప్పటికే సినిమాల్లో రాణిస్తోంది. ఆమే పేరు చరిష్మా శ్రీకర్. నటిగా పలు సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ అందాల తార లక్ష్మీ కటాక్షం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘నీతోనే హాయ్ హాయ్’.. ‘ఆర్ యూ మ్యారీడ్’ వంటి సినిమాల్లోనూ కథానాయికగా కనిపించింది.
ఆ మధ్యన వచ్చిన జగపతి బాబు ‘రుద్రంగి’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించింది చరిష్మా శ్రీకర్. అలాగే కొన్ని నెలల క్రితం విడుదలైన ప్రేమలో అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. అయితే హీరోయిన్ గా ఇంకా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదీ అందాల తార. ఇక సోషల్ మీడియాలో చరిష్మాకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కూడా చూడటానికి అచ్చం తన తల్లిలానే ఉంటుంది. మరి ఈ మధ్యన నెట్టింట బాగా వైరలైన చరిష్మా ఫొటోలపై ఓ లుక్కేయండి.




