Cinema : ఏం సినిమా బ్రో.. దెయ్యమే ఉండదు.. కానీ ఒంటరిగా చూడాలంటే వెన్నులో వణుకే..
హారర్ సినిమాలు చూడడమంటే చాలా మంది తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈమధ్య కాలంలో హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక హారర్ సినిమా ఒంటరిగా చూడాలంటే వెన్నులో వణుకుపుడుతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసుకుందామా.

సాధారణంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భయం పుట్టించే విజువల్స్.. ఊహించని ట్విస్టులతో సాగే సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఓటీటీలో మిస్టరీ, సస్పెన్స్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండగా.. ఆ జానర్ చిత్రాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నాయి. హారర్ సినిమా అంటే దెయ్యం, పిశాచిలతో ఆద్యంతం వణుకుపుట్టిస్తాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో దెయ్యం ఉండదు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం వణుకిపోతుంది. ఇంతకీ ఈ హారర్ సినిమా గురించి మీకు తెలుసా.. ? ఆ సినిమా పేరు 13B. వర్సటైల్ యాక్టర్ మాధవన్ నటించిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు టీవీల్లో మీరు చూసే ఉంటారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
మొదట్లో ఫ్యామిలీ డ్రామాగా సాగిన ఈ సినిమా.. ఆ తర్వాత నెమ్మదిగా ఊహించని మలుపులతో సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో దెయ్యం కనిపించదు.. కానీ మలుపులు, నిశబ్దమే మనల్ని మరింత భయపెట్టేలా చేస్తుంది. తెలియకుండానే మిమ్మల్ని ఒక ట్రామాకు తీసుకెళ్తుంది. ఇందులో తన కుటుంబంతో కొత్త అపార్ట్ మెంట్ కు మారిన మాధవన్ జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. తన ఇంట్లో ఉండే టీవీలో ఒక సీరియల్ మాత్రమే వస్తుంది. అందులో కనిపించే సన్నివేశాలు తన కుటుంబంలో జరుగుతుంటాయి.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఈ విషయాన్ని మాధవన్ గమనిస్తాడు. మొదట్లో చిన్న చిన్న సంఘటనలు మాత్రమే మ్యాచ్ అవుతుంటాయి. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది భయంకరమైన సన్నివేశాలు జరుగుతాయి. ఇక తర్వాత సస్పెన్స్, ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. కానీ ఆద్యంతం ఊహించని మలుపులతో మీకు భయం కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..




