Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
తెలుగు, తమిళం, మలయాళం చిత్రపరిశ్రమలో ఒకప్పుడు చక్రం తిప్పిన తారలు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుని ఇప్పుడు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. అప్పట్లో విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

కలువ కన్నులు.. చూడచక్కని రూపం.. చూడగానే కట్టిపడేసే అందం.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె కళ్లతోనే నటిస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు మాధవి. పైన ఫోటోలో కలువ కన్నులతో కట్టిపడేస్తున్న హీరోయిన్ మాధవి. 80వ దశకంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. వెండితెరపై ఆమె కళ్లల్లో ఎన్నో భావోద్వేగాలు, సంఘర్షణలను చూశాం.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
మాధవి… ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మలయాళం, తెలుగు, తమిళంలో భాషలలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాధవి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. 1993లో వచ్చిన మాతృదేవోభవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. 80, 90వ దశకంలో తన అందం, అభినయంతో అడియన్స్ ను అలరించిన మాధవి.. ఎక్కువగా చిరుతో కలిసి నటించింది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
వీరిద్దరి కాంబోలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు , దొంగమొగుడు, వంటి చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ఖైదీ చిత్రంలో రగులుతుంది మొగలిపొద పాటకు చిరుతో కలిసి నటించింది. దాదాపు 17 కెరీర్ లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను 1996లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయిన ఆమె.. అక్కడే స్థిరపడింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

Madhavi Family
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..








