స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దెబ్బకు ఇండస్ట్రీకి వదిలి వెళ్లిపోయింది.. ఇప్పుడు 43 వేల కోట్లకు మహారాణి..
సాధారణంగా సినీరంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు చాలా మంది. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. మరికొందరు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేరు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది.

సినిమా ప్రపంచంలో కొత్త హీరోయిన్లకు అసలు కొదవే లేదు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన బ్రేక్ రానీ తారల గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం.. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఒక్క సినిమాతోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఒక సినిమా సినిమా అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈతరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని హీరోయిన్.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
గాయత్రి జోషి.. హిందీలో ఒక్క సినిమాలోనే నటించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సరసన స్వదేశ్ చిత్రంతో సినీరంగంలోకి కథానాయికగా అడుగుపెట్టింది గాయత్రి జోషి. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మరో మూవీ చేయలేదు. 2004లో విడుదలైన ఈ సినిమా తర్వాత గాయత్రి మరో సినిమా చేయలేదు. ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె సినీ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. భారతదేశంలోని ప్రసిద్ధ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన గాయత్రి.. తన భర్తతో కలిసి కుటుంబాన్ని , వ్యాపారాలను చూసుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇక ఇటీవల విడుదలైన హురున్ రిచ్ లిస్ట్ 2025 నివేదిక ప్రకారం గాయత్రి జోషి భర్త వికాస్ ఒబెరాయ్ సంపద రూ.42,960 కోట్లు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోని టాప్ 100 ధనవంతుల జాబితాలో 58వ స్థానంలో నిలిచారు, అంతేకాకుండా భారతదేశంలోని టాప్ 5 రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకులలో 4వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. , వికాస్ ఒబెరాయ్ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ యజమాని. సినిమాల్లోకి రాకముందు గాయత్రి విజయవంతమైన మోడల్. 1999లో, ఆమె మిస్ ఇండియా ఫైనలిస్ట్. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

Gayatri Joshi New
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








