AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa: ఇదేం ట్విస్ట్! ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు కుంభమేళా బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే?

గతేడాది ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోన్‌స్లే ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా ఈ అమ్మడు తన ప్రియుడితో కలిసి కేరళలోని తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్‌ లో సడెన్ గా ప్రత్యక్షం అయ్యింది

Monalisa: ఇదేం ట్విస్ట్! ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు కుంభమేళా బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే?
Kumbh Mela viral girl Monalisa Bhonsle
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 6:02 PM

Share

గతేడాది ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయిపోయింది మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోన్‌స్లే. తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది మోనాలిసా. అలాగే యాడ్స్ తోనూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా మోనాలిసా ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్‌ బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడు ఫర్మాన్ ఖాన్ తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తోంది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రియుడి కోసం ఆమె తిరువనంతపురం చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని ఈ జంట కేరళ పోలీసులను ఆశ్రయించింది.

మోనాలిసా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినది. ఫర్మాన్ ఖాన్ మహారాష్ట్రకు చెందినవాడని ప్రస్తుతం కేరళలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో తన తండ్రి తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని ఈ ప్రేమజంట కేరళ పోలీసులను ఆశ్రయించింది. మోనాలిసా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తాము ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, అయితే మోనాలిసా- ఫర్మాన్ ఖాన్ లకు చట్టపరమైన సహాయం అందిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కాగా మహా కుంభమేళాలో మోనాలిసాను చూసిన బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సరోజ్ మిశ్రా ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. తాను తెరకెక్కిస్తోన్న’ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇందుకోసం మోనాలిసాకు స్పెషల్ గా యాక్టింగ్ లో శిక్షణ కూడా ఇప్పించారు. ఇక ఈ అమ్మడు తెలుగులోనూ చాన్స్ కొట్టేసింది. తెలుగులా మోనాలిసా హీరోయిన్‍గా సాయి చరణ్ హీరోగా ‘లైఫ్’ అనే మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మోనాలిసా లేటెస్ట్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
Video: యుద్ధవిమానం నడిపిన థాయ్‌లాండ్ రాణి .సోలో ఫ్లైట్‌తో సంచలనం
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?
ఆసియా ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?