Bigg Boss 9 Telugu: ఇక ఆట షూరు.. బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీళ్లే..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు సరికొత్త హంగులతో అడియన్స్ ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఈ షో అట్టహాసంగా ప్రారంభంకాగా.. ఈసార ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఉండనుంది. అయితే ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ చూసేయ్యండి.

బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 9 వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ 9 భారీ హంగులతో ప్రారంభమైంది. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఈ షో సాగనుందని ముందు నుంచే చెప్పారు నాగార్జున. మీరెంతగానో అభిమానించే సెలబ్రెటీలు ఓవైపు.. సత్తా చూపించే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్బాస్ సీజన్ 9ను గ్రాండ్ గా లాంచ్ చేశారు నాగార్జున. ఈసారి అందరికీ పరీక్షలు తప్పవని ముందే హెచ్చరించారు బిగ్బాస్. ఈసారి సెలబ్రెటీలతోపాటు ఆరుగురు సామాన్యులకు బిగ్బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వారెవరో చూద్దామా.
మొదటి కంటెస్టెంగ్ గా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి అడుగుపెట్టింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మొన్నటివరకు స్టార్ మాలో కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంది. బిగ్బాస్ హౌస్ లోకి వస్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని చెప్పడంతో.. మా అమ్మాయిల చూసుకుంటామని అభయమిచ్చారు నాగ్.
View this post on Instagram
ఇక రెండవ కంటెస్టెంట్ గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ అడుగుపెట్టారు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, చాలా బాగుంది వంటి చిత్రాలతో జనాలకు దగ్గరయ్యింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు బిగ్బాస్ షోతో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.
View this post on Instagram
మూడవ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ పడాల.. సోల్జర్ కళ్యాణ్ అని కూడా పిలుస్తుంటారు. బిగ్బాస్ షో కోసం ఆర్మీ ఉద్యోగానికి సెలవు పెట్టి అగ్నిపరీక్షలో పాల్గొన్నాడు. చివరకు విజేతగా నిలిచి బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ కామనర్ గా నిలిచాడు.
View this post on Instagram
నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన ఇమ్మాన్యుయేల్ ఆ తర్వాత స్టార్ మాలో కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొన్నాడు.
View this post on Instagram
ఐదో కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ అడుగుపెట్టారు. ఇన్నాళ్లు పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన శ్రష్టి.. తనకు బిగ్బాస్ షో అంటే చాలా ఇష్టమని చెప్పారు.
View this post on Instagram
ఆరో కంటెస్టెంట్ కామనర్ హరిత హరీశ్. అలియాస్ మాస్క్ మ్యాన్. అగ్నిపరీక్ష జ్యూరీ మెంబర్ అయిన బింధు మాధవి ఆయన పేరును ఎంపిక చేసారు. జీవితంలో తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు బిగ్బాస్ తనకు ఊరటనిచ్చిందని అన్నారు.
View this post on Instagram
ఏడవ కంటెస్టెంట్ సీరియల్ నటుడు భరణి. స్రవంతి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. అయితే రావడంతోనే బాక్స్ తో వెళ్లేందుకు బిగ్బాస్ అడ్డు చెప్పారు. పర్సనల్ వస్తువులు తీసుకెళ్లడం కుదరదని బిగ్బాస్ చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. కానీ కాసేపటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న బాక్స్ లో ఉన్న చైన్ చూపించారు.
View this post on Instagram
ఎనిమిదవ కంటెస్టెంట్ గా బబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు పలు షోలు, ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇప్పుడు బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.
View this post on Instagram
తొమ్మిదవ కంటెస్టెంట్ గా మరో కామనర్ డిమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. అగ్నిపరీక్ష ద్వారా బిగ్బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు.
View this post on Instagram
పదవ కంటెస్టెంట్ గా బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ అడుగుపెట్టారు. తన జీవితంలో వచ్చిన సవాళ్లు.. కష్టాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై పడిన నిందను తుడిపేయడానికే హౌస్ లోకి వచ్చినట్లు తెలిపారు.
View this post on Instagram
పదకొండవ కంటెస్టెంట్ గా ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. రాను బొంబయికి రాను పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాడు. ఇప్పుడు బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
View this post on Instagram
పన్నెండవ కంటెస్టెంట్ గా కామనర్ శ్రీజ దమ్ము పేరును జ్యూరీ మెంబర్ నవదీప్ సెలక్ట్ చేశారు. తానెప్పుడు విజేత స్థానానికే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది.
View this post on Instagram
పదమూడవ కంటెస్టెంట్ గా టాలీవుడ్ కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. జయం సినిమాతో మొదలైన ప్రయాణం ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయళం, భోజ్ పురి చిత్రాల్లో నటించేలా చేసిందని అన్నారు.
View this post on Instagram
పదనాల్గవ కంటెస్టెంట్ గా సామాన్యుల కేటగిరి నుంచి ప్రియశెట్టి ఎంపికైంది. ఆమెను అడియన్స్ ఓటింగ్ ద్వారా సెలక్ట్ చేశారు.
View this post on Instagram
ఇక చివరగా యాంకర్ శ్రీముఖి వచ్చి.. జ్యూరీ మెంబర్ అభిజిత్ ఎంపిక ప్రకారం కామనర్ మర్యాద మనీష్ ను పదిహేనవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..








