Bigg Boss 9 Telugu : సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన కామనర్.. 15వ కంటెస్టెంట్ అతడే.. సెలక్ట్ చేసిన శ్రీముఖి..
బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో 9 మంది సెలబ్రెటీస్ కాగా.. ఆరుగురు కామనర్స్ ఉన్నారు. సీరియల్, సినిమాల తారలతోపాటు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఎన్నో టాస్కులు కంప్లీట్ చేసిన కామనర్స్ మధ్య ఆట ఎలా ఉండనుందనేది రేపటి నుంచి చూడబోతున్నాము.

బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. హోస్ట్ నాగార్జున మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. అందులో 9 మంది సెలబ్రెటీలు, 6 కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ లోకి రావడానికి చిన్న అవకాశం కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీముఖి హోస్ట్ గా.. బింధుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జీలుగా మొత్తం 13 మందిని టాప్ కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి వారిలో నుంచి ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. అయితే మొదట సీరియల్ బ్యూటీ తనూజ గౌడ, పవన్ కళ్యాణ్, ఆశా షైనీ, హరిత హరిష్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, సంజన, భరణి, రాము రాథోడ్, దమ్ము శ్రీజ హౌస్ లోకి అడుగుపెట్టారు.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా.. . అయితే చివరగా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్ మర్యాద మనీష్ 15వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అతడిని హౌస్ మేట్ గా యాంకర్ శ్రీముఖి, అభిజిత్ కలిసి సెలక్ట్ చేశారు. చివరకు మనీష్ ఎంట్రీతో సామాన్యుల బలం మరింత పెరిగింది. మనీష్ మొదటి నుంచి అగ్నిపరీక్షలో టాస్కులలో సత్తా చాటుతూ వస్తున్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో కష్టతరమైన టాస్కులలో గెలిచాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
మనీష్ విషయానికి వస్తే.. మనీష్ మర్యాద భారతదేశానికి చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ఫెల్లో సహ వ్యవస్థాపకుడు. 2021లో స్థాపించబడిన ఫెల్లో అనేది “పెట్టుబడి మరింత సరదాగా చేయడానికి వినియోగదారులకు బహుమతులు” అందించే వేదిక. అతను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు సంపాదించాడు. మనీష్ వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?




