Bigg Boss 9 Telugu : ఆ కేసులో నా పేరు ఇరికించారు.. నా జీవితాన్ని నాశనం చేశారు.. స్టేజ్ పై సంజన కన్నీళ్లు..
బిగ్‌బాస్ సీజన్ 9 అట్టహాసంగా జరుగుతుంది. ఇప్పటికే తనూజ గౌడ, ఫ్లోరా షైనీ, ఇమ్మాన్యుయేల్, మాస్క్ మ్యాన్ హరీష్, భరణి, పవన్ కళ్యాణ్ పడాల, రాము రాథోడ్, దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజన గల్రానీ స్టేజ్ పై ఎమోషనల్ అయ్యింది. తన పేరును ఓ కేసులో ఇరికించి తన జీవితాన్ని నాశనం చేశారని చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది హీరోయిన్ సంజన గల్రానీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఓ కేసులో ఆమె పేరు బయటకు రావడం.. ఆ తర్వాత సినిమాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి 10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఏవీలో తన కెరీర్ గురించి చెబుతూ సంజన ఎమోషనల్ అయ్యారు. గతంలో తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు గురించి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన పేరును ఓ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఎంక్వరీ అని పిలిచి తనను అరెస్ట్ చేశారని.. ఆ సమయంలో తనకు చావు ఎందుకురాలేదని అనిపించిందని.. విషయం ఏం లేకుండానే తన గురించి ఎన్నో కథనాలు ప్రసారం చేశారని.. తన జీవితాన్ని నాశనాన్ని చేశారంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
డ్రగ్స్ కేసులో తనకు హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని.. కానీ ఆ విషంయ జనాలకు అంతగా తెలియలేదని తెలిపింది. కోవిడ్ సమయంలో తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్నానని.. ఆ తర్వాత తనకు బాబు జన్మించాడని తెలిపింది. అలాగే ఈ ఏడాది తనకు పాప పుట్టిందని.. తన ఐదు నెలల కూతురిని తన భర్త దగ్గర వదిలి వచ్చానని అన్నారు. తన లైఫ్ గురించి చెబుతూ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ షో ద్వారా తన గురించి తెలియజేస్తానని.. తనపై పడిన నిందను తొలగించుకుంటానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..








