AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sree Vishnu: 15 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథ.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీ విష్ణు.. ఏ సినిమానో తెలుసా?

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు శ్రీ విష్ణు. ఆ తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో సహాయనక నటుడిగా కనిపించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక నీది నాది ఒకే కథ సినిమాతో సోలో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు.

Sree Vishnu: 15 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథ.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీ విష్ణు.. ఏ సినిమానో తెలుసా?
Sree Vishnu
Basha Shek
|

Updated on: Oct 11, 2025 | 5:55 PM

Share

కెరీర్ ప్రారంభంలో ప్రేమ ఇష్క్ కాదల్, సెకెండ్ హ్యాండ్, అప్పట్లో ఒకడుండే వాడు తదితర సినిమాల్లో నటించాడు శ్రీ విష్ణు. అయితే సోలో హీరోగా మాత్రం అతనికి బ్రేక్ ఇచ్చింది నీది నాది ఒకే కథ సినిమానే. అంతకు ముందు చేసిన మెంటల్ మదిలో సినిమా కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. వీటి తర్వాత బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, అల్లూరి తదితర సినిమాల్లో నటించాడు. సామజ వరగమనతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఓమ్ భీమ్ బుష్ కూడా బాగానే ఆడింది. కమర్షియల్ హిట్ కాకున్నా స్వాగ్ కూడా శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక చివరిగా సింగిల్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో నటించాడు శ్రీ విష్ణు. ఈ ఏడాది మేలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలోతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 23 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

అయితే సింగిల్ సినిమా కథను మొదట 15 మంది హీరోలు తిరస్కరించారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ విష్ణునే ఓ సందర్భంలో వెల్లడించాడు.’ సింగిల్ సినిమా కథను మూడేళ్ల క్రితమే డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు చెప్పారు. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారు వాళ్లందరికీ కూడా థాంక్యూ’ అని ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. అయితే ఈ హీరోల పేర్లు మాత్రం వెల్లడించలేదు. కాగా సింగిల్ సినిమా ఆఫర్ మొదట యూత్ స్టార్ నితిన్ దగ్గరకు వెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికే అతని చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజుతో పాటు సేవకులను చంపారు.. పురాతన ఈజిప్టులో ఏం జరిగింది?
రాజుతో పాటు సేవకులను చంపారు.. పురాతన ఈజిప్టులో ఏం జరిగింది?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ