Yadammaraju: ఎట్టకేలకు కూతురు ఫేస్ చూపించిన జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు.. ఎంత క్యూట్ గా ఉందో! వీడియో
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో యాదమ్మ రాజు ఒకడు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడీ కమెడియన్. మరోవైపు బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు. కాగా గతేడాది ఇదే రోజున (అక్టోబర్ 11) న యాదమ్మ రాజు దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ఒక సాధారణ స్టాండప్ కమెడియ్ గా పరిచయమయ్యాడు యాదమ్మ రాజు. పటాస్ కామెడీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు యాదమ్మ రాజు. అలాగే సినిమాల్లోనూ నటిస్తున్నాడు. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. యాదమ్మ రాజు నటి స్టెల్లా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గత ఏడాది అక్టోబర్ 11వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఈ పాపకు ముద్దుగా గిఫ్టీ అని పేరు పెట్టుకున్నారు. అయితే తమ బిడ్డ పేరును జెనీసా అని అందరికీ పరిచయం చేశారు. కాగా చాలా మంది లాగే యాదమ్మ రాజు- స్టెల్లా దంపతులు తమ కుమార్తె ముఖాన్ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సోషల్ మీడియాలో తమ కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసినప్పటికీ ఎక్కడా తమ కూతురి ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు తాజా తమ కుమార్తె ఫేస్ రివీల్ చేశారీ జబర్దస్త్ కపుల్. జెనీసా మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని తన కూతురికి బర్త్ డే విషెస్ చెప్పారు యాదమ్మ రాజు దంపతులు. ఈ సందర్భంగా తమ కూతురి ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకు్నారు. తమ కూతురు తమ జీవితంలోకి రావడంతో తమ ప్రపంచమే మారిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం యాదమ్మరాజు -స్టెల్లా దంపతుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు కూతురికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే పాప చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా ప్రస్తుతం బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడి పాత్రలు పోషిస్తున్నాడు యాదమ్మ రాజు. అలాగే బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు.
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కూతురి ఫొటోస్..
View this post on Instagram
భార్య స్టెల్లాతో కమెడియన్ యాదమ్మ రాజు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








