AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: టీనేజ్ అమ్మాయిని చంపిందెవరు? OTTలో వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటమంటే ఇంట్రెస్టా? అయితే మీలాంటి వారి కోసమే ఓ సూపర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒక టీనేజీ అమ్మాయి దారుణ హత్య, దాని చుట్టూ సాగే విచారణ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.

OTT Movie: టీనేజ్ అమ్మాయిని చంపిందెవరు? OTTలో వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 10, 2025 | 10:10 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో ఉంటోన్న ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఇవాళ్టి (అక్టోబర్ 10) నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ చాలా హైప్ క్రియేట్ చేశాయి. నీళ్లలో పడిపోయిన కారును బయటకు తీయడం, అందులో నైనా అనే ఓ టీనేజీ అమ్మాయి శవం ఉండటం, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు ఏసీపీలు రంగంలోకి దిగడం.. ఇలా ట్రైలర్ లోనే సిరీస్ ఎలా సాగుతుందో ఒక శాంపిల్ చూపించారు. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. టీనేజ్ అమ్మాయి హత్య కేసును ఛేదించేందుకు సంయుక్త దాస్, జై కన్వల్ అనే సీనియర్ పోలీసాఫీసర్లు రంగంలోకి దిగుతారు. తమ దైన శైలిలో కిల్లర్ వేట మొదలు పెడతారు. అయితే ఆ హత్య కేసును తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎంతో మంది అనుమానితులు పుట్టుకొస్తారు. అమ్మాయి చదివే కాలేజీ ట్రస్టీ నుంచి బాయ్‌ఫ్రెండ్, ఫ్రెండ్స్, కాలేజీ ప్రొఫెసర్లు.. ఇలా అందరి పైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి వీరిలో ఎవరు అమ్మాయిని చంపారు? అసలు ఈ మర్డర్ వెనక మోటివ్ ఏంటి? పోలీసులు హంతకుడిని ఎలా పట్టుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ఆద్యంతం ఉత్కంఠ రేపే సన్నివేశాలు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ సిరీస్ పేరు.. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. రోహన్ సిప్పీ తెరకెక్కించిన ఈ సిరీస్ లో కొంకణా సేన్ శర్మ, సూర్య శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రద్ధా దాస్, వరుణ్ ఠాకూర్, ధృవ్ సెహగల్, శివ్ పండిట్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునే వారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.