AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు వైజాగ్ జాయింట్ కలెక్టర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ యాక్టర్.. కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?

'డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాను'.. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటుల నోటి నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఈ నటుడు సినిమాల మీద ఆసక్తితో ఏకంగా జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్నే వదులుకున్నాడు.ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

Tollywood: ఒకప్పుడు వైజాగ్  జాయింట్ కలెక్టర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ యాక్టర్.. కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Oct 10, 2025 | 8:00 PM

Share

తెలుగు సినిమా నటుల్లో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారే. డిగ్రీలు, ఎంబీబీఎస్ లు, ఇంజినీరింగ్ లు, మాస్టర్స్, పీహెచ్ డీలు పూర్తి చేసిన వారే. ఇంకొంత మంది విదేశాల్లోనూ ఉన్నత చదువులు అభ్యసించారు. తమ విద్యార్హతలతో మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేశారు. కానీ సినిమాలపై ఆసక్తి, నటనపై మక్కువతో చాలా మంది లక్షల జీతాలు, లగ్జరీ లైఫ్ ను వదిలి పెట్టి మరీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక్కడే తమ కొత్త జీవితాన్ని వెతుక్కున్నారు. ఈ టాలీవుడ్ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఎన్నో ఉన్నత చదువులు చదివిన ఈ నటుడు సినిమాల మీద ఆసక్తితో ఏకంగా జాయింట్ కలెక్టర్ జాబ్ నే వదిలేశాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈయనకు చిన్నతనం నుంచే సినిమాలు, సాహిత్యం మీద మక్కువ ఉండేది. కానీ నటుడు అవ్వాలని మాత్రం అనుకోలేదు. బుద్దిగా ఉన్నత చదువులు చదువుకొని జాయింట్ కలెక్టర్ అయ్యాడు. ఇదే సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక ఫేమస్ డైరెక్టర్ తన సినిమాలో ఈ నటుడికి ఒక చిన్న పాత్ర ఇచ్చాడు.

తన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో జాయింట్ కలెక్టర్ గా చేస్తూనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించారు. దీంతో గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పటివరకు సుమారు 70 చిత్రాల్లో వివిధ పాత్రల్లో కనిపించిన ఆ నటుడు మరెవరో కాదు వడ్లమాని శ్రీనివాస్.

ఇవి కూడా చదవండి

జాయింట్ కలెక్టర్ గా చేస్తూనే సినిమాలు..

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శ్రీనివాస్. గీత గోవిందం, ప్రతిరోజు పండగే, శైలజా రెడ్డి అల్లుడు, ‘నా సామి రంగా, భగవంత్ కేసరి, పెదకాపు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు. ముఖ్యంగా పెదకాపు సినిమాలో వడ్లమాని పోషించిన గెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ది రాజాసాబ్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు శ్రీనివాస్. దీంతో పాటు ఆయన చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

వడ్లమాని శ్రీనివాస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.