Neeraja Kona: తాత గవర్నర్.. తండ్రి ఎమ్మెల్యే.. ‘తెలుసు కదా’ సినిమా డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా?
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తెలుసు కదా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాతో డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకోనుంది నీరజా కోన.

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నీరజా కోనకు పేరుంది. తెలుగు, తమిళ్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలు, హీరోయిన్లందరికీ ఆమె పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్. వారి సినిమాలన్నింటికీ నీరజనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అలాంటిది ఇప్పుడామె మెగా ఫోన్ పట్టుకుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి తెలుసు కదా అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న నీరజ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నీరజ కోన తాతయ్య కోన ప్రభాకర రావు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, బాపట్ల ఎమ్మెల్యేగా సేవలందించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా చేశారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినేట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే మహారాష్ట్ర, సిక్కింలకు గవర్నర్ గా కూడా పనిచేసారు. ఇక నీరజ కోన తండ్రి కోన రఘుపతి ఇదే బాపట్ల నుంచి వైసీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ విషయాలు చాలా మందికి తెలియదు. దీంతో ఈ డైరెక్టర్ కు ఇంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా వెలుగొందుతోన్న కోన వెంకట్ నీరజకు అన్నయ్య అవుతాడు.
తెలుసు కదా సినిమా ప్రమోషన్లలో నీరజా కోన..
View this post on Instagram
కాగా నీరజ కోన కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు మంచి రచయిత కూడా. ఆమె ఇప్పటికే ఓ ఇంగ్లిష్ బుక్ ని రాసి రిలీజ్ కూడా చేసింది. మొత్తానికి మల్టీ ట్యాలెంట్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నీరజ.
తండ్రి కోన రఘుపతితో నీరజ..
View this post on Instagram
తెలుసు కదా సినిమా షూటింగ్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








