Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 2.0 లోడింగ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ టాలీవుడ్ యంగ్ హీరో.. ఫైనల్ లిస్ట్ ఇదిగో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 12) వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ఎంట్రీ ఉండనుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్ కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కొత్త కంటెస్టెంట్ల ఏవీ వీడియోల షూట్ కూడా పూర్తైందని సమాచారం.

బిగ్ బాస్ 2.o గ్రాండ్ లాంచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (అక్టోబర్ 12) జరిగే ఎపిసోడ్ లో కొత్త కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఇంట్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. డబుల్ ఎలిమినేషన్ తో పాటే వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి బిగ్ బాస్ ఇప్పటికే ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆదివారం జరిగే ఎపిసోడ్ కు ‘ఫైర్ స్ట్రామ్ ఎపిసోడ్’ అని పేరు కూడా పెట్టాడు. కాగా బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష , ప్రభాస్ శ్రీను, అఖిల్ రాజ్, సుహాసినిల ఇలా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త లిస్ట్ నెట్టింట వైరలవుతోంది. దివ్వెల మాధురి, రమ్య మోక్ష దాదాపు కన్ఫామ్ అయ్యారని వీరితో పాటు ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస సాయి కూడా హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది.
ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస సాయి. గోల్కోండ హైస్కూల్ తో పాటు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్డిస్టుగా నటించాడు శ్రీనివాస. ఆ తర్వాత శుభలేఖలు, వినరా సోదర వీర కుమార వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడీ యంగ్ హీరో బిగ్ బాస్ లోకి రానున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే సీరియల్ హీరోలు గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ లు కూడ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలుసుకోవాలంటే ఆదివారం జరిగే ఫైర్ స్ట్రామ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
కొత్త కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదిగో..
View this post on Instagram
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
Mass mode ON! Housemates brace themselves for the ultimate ruling! 🔥💥 #FirestromIsComing
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/UrsRscJUJa
— Starmaa (@StarMaa) October 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








