AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: వరస్ట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు.. భరణికి షాకిచ్చిన కళ్యాణ్.. దివ్యకు తనూజ వెన్నుపోటు..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదో వారం హౌస్ కెప్టెన్ అయ్యాడు కళ్యాణ్ పడాల. రెండు వారాలుగా ఆటలో అదరగొడుతున్నాడు. మొన్నటి వరస్ట్ ప్లేయర్ అని హౌస్మేట్స్ కామెంట్స్ చేసిన కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా హౌస్ కెప్టెన్ అయ్యాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లోనూ తెలివితో ఇరగదీశాడు.

Bigg Boss 9 Telugu: వరస్ట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు.. భరణికి షాకిచ్చిన కళ్యాణ్.. దివ్యకు తనూజ వెన్నుపోటు..
Bigg Boss 9 Telugu (6)
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2025 | 9:26 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదో వారం నడుస్తుంది. ఇప్పటివరకు మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సమయం ఆసన్నమైంది. గత నాలుగు రోజులుగా వరుస టాస్కులతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్ . డేంజర్ జోన్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ గెలుచుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ కోసం ఇమ్యూనిటీ త్యాగం చేసింది తనూజ. దీంతో కళ్యాణ్ ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. మరోవైపు తనూజ కోపంతో ఆట తీరు మార్చుకున్నాడు కళ్యాణ్. నా మీద కాదు గేమ్ మీద ఫోకస్ చేయ్ కళ్యాణ్ అంటూ తనూజ గట్టిగానే ఫైర్ అయ్యింది. దీంతో ప్రతి టాస్కులో ఇరగదీశాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

బిగ్‌బాస్ ఐదవ వారం కెప్టన్ కంటెండర్లుగా ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, తనూజ, కళ్యాణ్ సెలక్ట్ అయ్యారు. అయితే ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్కులో తనూజ గెలవడంతో కెప్టెన్ కంటెండర్స్ టాస్కులో అవకాశం దక్కించుకుంది. గార్డెన్ ఏరియాలో నీటితో నిండిన పూల్స్ పెట్టి అందులో టీంమేట్స్ పడుకోమన్నారు. డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయాలనుకున్న వాళ్ల టబ్ లో నుంచి నీటిని తీసి ఇతరుల టబ్ లో సేవ్ జోన్ లో ఉన్నవపాళ్లు పోయెచ్చు. ఈ టాస్కులో ఫ్లోరా సంచాలక్ గా వ్యవహరించారు. అయితే తనకు వాటర్ ఫోబియా ఉందని భరణి దగ్గర కన్నీరు పెట్టుకుంది తనూజ. ఇమ్మాన్యుయేల్ సంజనకు సపోర్ట్ చేస్తా ్న్నారు. ముందుగా సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకున్నాడు అంటూ ఫ్లోరా అతడిని గేమ్ నుంచి తీసేసింది.దీంతో సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

అయితే గేమ్ ఏంటో ఐడియా ఉందా..? మీరు ఎవరిని సేవ్ చేయాలని అనుకుంటున్నారో.. వాళ్ల టబ్ నుంచి నీటిని తీసి వేరేవాళ్ల టబ్ లో వేయాలి అని బిగ్ బాస్ హెచ్చరించ్చారు. దీంతో డిమాన్ టబ్ లో నీళ్లు ఎక్కువగా ఉండడంతో అతడిని ఎలిమినేట్ చేశారు. తనూజ ఈ టాస్కులో సేవ్ అయ్యింది. దివ్య, తనూజ మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. కానీ రీతూ కంగ్రాట్స్ చెప్పలేదంటూ బాధపడింది తనూజ. ఇక కెప్టెన్సీ టాస్కు కోసం కనుక్కోండి చూద్దాం అనే కెప్టెన్సీ టాస్కుకు సంజన సంచాలక్..ఇందులో పోటీ దారులు అందరూ కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవాలి. బజన్ మోగినప్పుడల్లా సంచాలక్ ఒకరి భూజాన్ని తట్టాలి. ఆ పోటీదారు చైర్ లో కూర్చున్న ఒకరి లైట్ ఆఫ్ చేసి మళ్లీ కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవాలి.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

లైట్ ఆఫ్ అయిన సభ్యులు తమ లైట్ ఆఫ్ చేసింది ఎవరో కనిపెట్టాలి. ఎవరైతే సరిగ్గా కనిపెడతారో వాళ్లు విన్నర్.. లేదంటే రేస్ నుంచి ఔట్ కావాలి. ముందుగా రాము .. దివ్య లైట్ ఆఫ్ చేయగా.. ఆమె కరెక్టుగా గెస్ చేసింది. దీంతో రాము ఔట్ అయ్యాడు. ఆ తర్వాత భరణి పేరును కళ్యాణ్ సరిగ్గా చెప్పడంతో భరణి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇమ్మూ, దివ్య, కళ్యాణ్, తనూజ రేసులో మిగిలారు. తనూజకు ఛాన్స్ ఇవ్వగా వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది. అయితే దివ్య కళ్యాణ్ పేరు చెప్పింది. దీంతో దివ్య ఔట్ అయ్యింది. మిగిలిన ముగ్గురిలో కళ్యాణ్ కెప్టెన్ గా గెలిచాడు.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..