Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ప్రస్తుతం కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీన్ ను షేక్ చేస్తుంది. రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ సినిమా.. ఇప్పటికీ అదే దూకుడు కొనసాగిస్తోంది. రోజు రోజుకీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? సలార్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితోపాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అంతేకాదు.. ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కనిపించిన ఓ నటుడి ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? సినీప్రియులకు అతడు సుపరిచితమే. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. అతడి పేరు సంపత్ రామ్.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
సంపత్ రామ్.. పాన్ ఇండియా నటుడు. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో అనేక భాషలలో నటించారు. తెలుగులో సలార్, కన్నప్ప, డాకు మహారాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాల్లోనూ నటించారు. తమిలంలో దాదాపు 80కి పైగా సినిమాల్లో కనిపించారు. ఇదిలా ఉంటే.. రిషబ్ శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్ రామ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. దాదాపు 17 సంవత్సరాలుగా ఇద్దరూ స్నేహితులు. గతంలో ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇప్పుడు రిషబ్ శెట్టి పిలుపుతో కాంతార 1 చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు సంపత్ రామ్. ఇందులో తెగ నాయకుడి పాత్రలో కనిపించారు. అతడి భయంకరమైన లుక్, యాక్టింగ్ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. గతంలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన అట్టహాస సినిమాలో సంపత్ రామ్ కీలకపాత్రలో కనిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంపత్ రామ్ మాట్లాడుతూ.. “సినాద్, అట్టహాస చిత్రాలలో రిషబ్ శెట్టిని అసిస్టెంట్ డైరెక్టర్ గా చూశాను. అప్పటి నుంచి రిషబ్ నన్ను మాస్టర్..మాస్టర్ అని పిలుస్తాడు. రిషబ్ శెట్టి ‘బెల్‌బాటమ్’ చిత్రంలో హీరోగా మారినప్పుడు చాలా సంతోషించాను. కాంతార-1′ ఫస్ట్ లుక్ చూసి మీ సినిమాలో కూడా అవకాశం ఇవ్వండి అని నేను అతనికి మెసేజ్ పంపాను. అతను రెండు వారాల్లోనే నాకు ఫోన్ చేసి, ‘నువ్వు మా సినిమాలో పని చేస్తావా అని అడిగారు. గిరిజన నాయకుడి పాత్రకు మేకప్ వేయడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఈ పాత్రలో నటించడం సంతోషంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..








