- Telugu News Photo Gallery Cinema photos Can You Gues The Actress in This Photo, She Is Heroine Charmy Kaur
Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
సినీ రంగుల ప్రపంచంలో ఒకటి రెండు చిత్రాలతో ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. కానీ అదృష్టమే సరిగ్గా కలిసి రాదు. ఆఫర్స్ వచ్చినప్పటికీ సరైన బ్రేక మాత్రం అందుకోని తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి వచ్చినవారే.
Updated on: Sep 25, 2025 | 3:07 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా... ? ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ చార్మీ కౌర్. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మాస్, లక్ష్మీ, సుందరకాండ, మంత్ర, జ్యోతిలక్ష్మి, పౌర్ణమి, రాఖీ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో జనాలకు దగ్గరయ్యింది ఈ అమ్మడు.

నటనతోపాటు అటు గ్లామరస్ పాత్రలతోనూ అదరగొట్టింది. ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన చార్మీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది.

పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పై ఇప్పటివరకు దాదాపు 8 సినిమాలు నిర్మించారు. అందులో జ్యోతి లక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ తో కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తుంది ఛార్మి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పోటోస్ ఆకట్టుకుంటున్నాయి. నిర్మాతగా కొనసాగుతున్నప్పటికీ ఫిట్నెస్, లుక్స్ విషయంలో మాత్రం హీరోయిన్లకు గట్టిగానే పోటీఇస్తుంది.




