Ring Riyaz: బై బై ఇండియా.. దేశం విడిచి వెళ్లిపోయిన జబర్దస్త్ ఫేమ్ రింగ్ రియాజ్.. వీడియో వైరల్.. ఏమైందంటే?
జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రింగ్ రియాజ్ కూడా ఒకడు. చూడడానికి పొట్టిగా ఉన్నా కామెడీ పంచులు మాత్రం గట్టిగానే వేస్తాడీ కమెడియన్. బుల్లితెరతో పాటు పలు సినిమాల్లోనూ నటించిన రింగ్ రియాజ్ సడెన్ గా దేశం విడిచి వెళ్లిపోయాడు.

రింగ్ రియాజ్.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోల్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు ఇతను బాగా దగ్గరయ్యాడు రియాజ్. ఈ నటుడికి రింగ్ రియాజ్, గల్లీ బాయ్ రియాజ్ ఇలా చాలానే పేర్లు ఉన్నాయి. దసరా వంటి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ రియాజ్ నటించాడు. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. రాజకీయాల పరంగానూ రియాజ్ వార్తల్లో నిలిచాడు. మొదట జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన అతను నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఆ తర్వాత వైసీపీకి మద్దతుదారుడిగా మారిపోయారు. ఇక రెస్టారెంట్ బిజినెస్ లోనూ రాణించాడు కమెడియన్. నెల్లూరులో రింగ్ రియాజ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ కేప్ అనే రెస్టారెంట్ ను నిర్వహించాడు. ప్రస్తుతం బుల్లితెరపై కానీ వెండితెరపై కానీ పెద్దగా కనిపించడం లేదు. అదే సమయంలో రింగు రియాజ్ వాల్గ్స్ పేరుతో ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. అందులోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటున్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ కు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశాడు రియాజ్. ఇందులో తాను ఇండియా వదిలి వెళ్లిపోతున్నానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబర్లు విదేశాలకు వెళ్లిపోయి అక్కడ వీడియోలు చేస్తున్నారు. భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే రింగ్ రియాజ్ కూడా తన యూట్యూబ్ ఛానల్ కోసమే థాయిలాండ్ వెళ్తున్నానని తెలిపాడు వెల్లడించారు. ఇకపై ‘నాతో ప్రయాణం అనే కొత్త యూట్యూబ్ ఛానల్ లో తన ఫారిన్ టూర్స్ కు సంబంధించిన వీడియోలు మాత్రమే షేర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తమ మొదటి టూర్ లో భాగంగా థాయ్ లాండ్ వెళ్లిపోయాడు రియాజ్. ఇప్పటికే అక్కడి నుంచి ఒక ఆసక్తికర వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం రింగ్ రియాజ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది రియాజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతుండగా మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ రింగ్ రియాజ్ షేర్ చేసిన వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








