Bigg Boss 9 Telugu: కళ్యాణ్ కెప్టెన్సీ వెనుక ప్లాన్.. తనూజ ముందు నాగ్ వీడియో.. ఎపిసోడ్ అదిరింది..
శనివారం నాటి ఎపిసోడ్ లో మాస్ ఈజ్ బ్యాక్ అంటూ స్టైలీష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ దుమ్ముదులిపేశారు. గత వారం టాస్కులలో హౌస్మేట్స్ చేసిన తప్పులను వాళ్ల నోటితోనే చెప్పించారు. చివరకు కళ్యాణ్ కెప్టెన్సీ వెనుక ఉన్న ప్లాన్ మొత్తాన్ని తనూజ ముందు బయటపెట్టేశారు నాగ్. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది.

బిగ్బాస్ రియాల్టీ షోలో స్ట్రాటజీతో గేమ్స్ ఆడడం.. ఫౌల్ గేమ్స్ ఆడడం చూస్తుంటాం. ఇక వీకెండ్ లో హోస్ట్ వచ్చి కంటెస్టెంట్స్ తప్పులను చెబుతూ ఇచ్చిపడేస్తుంటాడు. శనివారం నాటి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో మాస్ స్టైలీష్ అవతారంలో ఎంట్రీ ఇచ్చారు నాగ్. చాలా కాలం తర్వాత మాస్ మూవీ లుక్ లో మరింత స్టైలీష్ గా కనిపించారు నాగ్. అలాగే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఫౌల్ గేమ్స్ ఆడిన కంటెస్టెంట్స్ కు ఇచ్చిపడేశారు. ముందుగా కెప్టెన్ కళ్యాణ్ ను అభినందించారు నాగ్. ఆ తర్వాత అతడికి గోల్డెన్ స్టార్ తనూజ పెడితే బాగుంటుందని ఇమ్మూ చెప్పడంతో తనూజ రామ్మా.. కళ్యాణ్ కు గోల్డెన్ స్టార్ పెట్టు అన్నారు. దాంతో తనూజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అడిగాడు కళ్యాణ్. ఇక తర్వాత కేవలం తనూజను మాత్రమే కన్ఫెషన్ రూంకు పిలిచి పర్సనల్ గా మాట్లాడారు నాగ్.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
కన్ఫెషన్ రూంలో తనూజకు డీమాన్ పవన్ చేసిన పని వీడియో చూపించారు. వీడియో చూశావు కదా.. అందులో నీకు ఏం కనిపించింది అని నాగ్ అడగ్గా.. డీమాన్ కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్ కు చూపిస్తున్నాడు సార్ అని చెప్పింది. దాంతో నాగార్జున కరెక్ట్ గా చెప్పావ్.. నువ్వు నాన్నా నాన్న అని బంధం పెంచుకున్న భరణి లైఫ్ ఆఫ్ చేశాడు అని డీమాన్ పవన్ క్లియర్ గా కళ్యాణ్ కు చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైమ్ తీసుకున్న తర్వాత కళ్యాణ్ లైట్ ఎవరిది ఆరిందో చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ.. కళ్యాణ్ కానీ చెప్పారా ? అని అడగ్గా.. లేదు సార్ అని చెప్పింది తనూజ.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
దీంతో నాగార్జున మాట్లాడుతూ.. గెలవడం ముఖ్యమే తనూజా.. ఎలా గెలిచాం అన్నది కూడా ముఖ్యమే. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో.. ఎవరు ఏంటో మర్చిపోకు.. నీ ఆటను దీన్ని బట్టి మార్చుకో అంటూ తనూజకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనూజకు గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఆ తర్వాత బెడ్ టాస్కులో తనూజ చేసిన మిస్టేక్ గుర్తు చేశారు. మొత్తానికి తనూజతో ఉంటూ.. ఇమ్యూనిటీ తీసుకున్న కళ్యాణ్.. ఆ తర్వాత తనూజతో ఉంటునే కెప్టెన్ అయిన ప్లాన్ బయటపెట్టి తనూజ కళ్లు తెరిపించారు నాగ్. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ కు ఇచ్చిపడేశాడు నాగ్. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








