Bigg Boss 9 Telugu : డబుల్ ట్విస్ట్.. ఫ్లోరా షైనీ ఎలిమినేషన్.. ఎంత సంపాదించిందంటే..
బిగ్ బాస్ ... బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈషోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 నడుస్తుంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలోకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. మరోవైపు డబుల్ ఎలిమినేషన్ తో ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 9.. ఐదో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ వారం మొత్తం టాస్కులతో చుక్కలు చూపించారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడు హోస్ట్ నాగార్జున. ముఖ్యంగా రీతూ, డిమాన్ పవన్ తోపాటు తనూజ, భరణి ఆట తీరును కడిగిపారేశారు. వీడియోస్ ప్లే చేస్తూ ఒక్కొక్కరి ఫౌల్ గేమ్ పై ప్రశ్నలు కురిపించారు. నాగార్జున దెబ్బకు తప్పు ఒప్పుకున్నారు కంటెస్టెంట్స్. ఇక ఈరోజు ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం లక్స్ పాప ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మొదటి వారం నుంచే డేంజర్ జోన్ లో ఉంది ఫ్లోరా. కానీ ఇతర కంటెస్టెంట్స్ చేసే పొరపాట్లతో సేవ్ అవుతూ వచ్చింది. కానీ మొదటి వారం నుంచి నామినేషన్లలో మాత్రం ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
తాజాగా ఆదివారం ఎపిసోడ్ లో ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దాదాపు ఐదు వారాలు హౌస్ లో కొనసాగిన ఫ్లోరా.. ప్రతి వారం రూ.3లక్షల చెప్పున పారితోషికం ఇచ్చారని టాక్. అంటే రోజుకు రూ.42,857 తీసుకున్నారని.. ఐదు వారాలకు గానూ మొత్తం రూ.15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే… ఐదు వారాల్లో ఎలిమినేట్ అయిన ఫ్లోరా మాత్రం ఆర్థికంగా ఎక్కువే తీసుకున్నట్లు టాక్. చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ఫ్లోరా.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఫ్లోరా షైనీ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ఆశ పాత్రలో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత లక్స్ పాప పాటతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఫ్లోరా.. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ హౌస్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండకుండా.. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. దీంతో ఫ్లోరాకు అంతగా కెమెరా స్పేస్ రాలేదు. ఇక ఈ వారం సంచాలక్ గా ఉన్న సమయంలో సుమన్ శెట్టిని ఆట నుంచి ఔట్ చేయడంతో ఫ్లోరా ఆట తీరుపై జనాలకు విసుగుపుట్టిందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..








