Bigg Boss Telugu 9: లీకైన బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు.. హౌస్‌లోకి ఎవరెవరు రానున్నారంటే?
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ఆదివారం (అక్టోబర్ 12) చాలా ట్విస్టులు ఉండనున్నాయి. డబుల్ ఎలిమినేషన్ తో పాటు ఈ వీకెండ్ ఎపిసోడ్ లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఆ కొత్త కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై ఓ లుక్కేద్దాం రండి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెడితే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అలాగే అగ్ని పరీక్ష నుంచి కామనర్ కోటాలో దివ్య నికితా అనే అమ్మాయి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంట్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం (అక్టోబర్ 12) జరిగే వీకెండ్ ఎపిసోడ్ లో మరికొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు బిగ్ బాస్. ఆదివారం జరిగే వీకెండ్ ఎపిసోడ్ కు ‘ఫైర్ స్ట్రామ్ ఎపిసోడ్’ అని పేరు కూడా పెట్టాశాడు. మరి ఆ ఫైర్ స్ట్రామ్ కంటెస్టెంట్స్ ఎవరా? అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష ,ప్రభాస్ శ్రీను, అఖిల్ రాజ్, సుహాసినీ, కావ్యశ్రీ, తనీశ్, అమర్ దీప్.. ఇలా చాలామంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై రివ్యూలు చెప్పే మాజీ కంటెస్టెంట్ తాజాగా ఇదే విషయంపై ఒక ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశాడు.
బిగ్ బాస్ 2.0లో మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని ఆది రెడ్డి చెప్పాడు. వీరితో మొదటి కంటెస్టెంట్ తమిళ్ బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి ఆయేషా పేరు చెప్పుకొచ్చాడు. రెండో కంటెస్టెంట్ గా గోల్కొండ హైస్కూల్ ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస సాయి హౌస్ లోకి రానున్నాడట. అలాగే సీరియల్ హీరోలు గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ లు కూడ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నాడని ఆది రెడ్డి చెప్పుకొచ్చాడు. ఐదో కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, ఆరో కంటెస్టెంట్ గా దివ్వెల మాధురి హౌస్ లోకి రానున్నారని సమాచారం.
వీడియో ఇదిగో..
View this post on Instagram
గతంలో ఆదిరెడ్డి అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. మరి ఈసారి కూడా ఆదిరెడ్డి చెప్పిన వాళ్లంతా బిగ్‌బాస్ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








