AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా తారలు తరచుగా బాడీ షేమింగ్ ను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా కలర్ విషయంలో చాలా మంది అవమానాలు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని కలర్ డిస్క్రిమినేషన్ తోపాటు బాడీ షేమింగ్ పై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tollywood: ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Sameera Reddy
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 7:31 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కెరీర్ కొనసాగించాలంటే అభినయంతో పాటు అందం కూడా ఉండాల్సిందే. అలాగనీ అందమే ప్రామాణికమే కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు నేటి సుహాస్ వరకు చాలా మంది స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. కలర్ విషయంలో వారు తరచూ అవమానాలు పడుతున్నారు. అలాగే తరచూ బాడీ షేమింగ్ కామెంట్స్ ను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు, మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. అలాగే బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే సినీ పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది.

‘సినిమా ఇండస్ట్రీలో తెల్ల తోలు వ్యామోహం ఉన్న కొంతమంది నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని.. ముఖానికే కాకుండా ఎక్కడైతే శరీరం బయటకు కనిపిస్తుందో అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. అలా వాళ్లు చెప్పడం వల్ల నేను అందంగా ఉండనేమో అనే ఆత్మన్యూనత నాలో కలిగేది.అలాగే పొట్టిగా, లావుగా ఉందంటూ బాడీ షేమింగ్ కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంట్ కన్నా కూడా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నన్ను మానసికంగా కలిచి వేసింది’

ఇవి కూడా చదవండి

సమీరా రెడ్డి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

‘ పెళ్లి, పిల్లల తర్వాత నేను బాగా బరువు పెరిగాను. పోస్ట్ పార్టమ్ వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా కాన్ఫిడెన్స్ ను పూర్తిగా కోల్పోయాను. ఆ సమయంలో నెటిజన్లు చేసిన నెగెటివ్ కామెంట్స్ నన్ను మానసిక క్షోభకు గురి చేశాయి. అయితే రెండో బిడ్డకు జన్మనిచ్చాక మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను. సానుకూల దృక్పథంతో ఆలోచించడం మొదలు పెట్టాను. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా ఇప్పుడు నాకేమీ అనిపించడం లేదు’ అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..