AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో హీరోయిన్ సంచలన నిర్ణయం

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హన్సిక మెత్వానీ. అయితే ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితమైందీ అందాల తార. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Hansika Motwani: పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో హీరోయిన్ సంచలన నిర్ణయం
Hansika Motwani
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 6:34 PM

Share

హీరోయిన్‌ హన్సిక మొత్వానీ మూడు ముళ్ల బంధానికి ముగింపు పలికింది.చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తన భర్త, వ్యాపారవేత్త సోహెల్‌ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని, తమకు విడాకులు మంజూరు చేయాలని హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. హన్సిక- సొహైల్ లది ప్రేమ  వివాహం. 2022 డిసెంబర్‌ 4న  జైపూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగింది.  పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చాలా కాలంగా వేర్వేరుగానే జీవిస్తుస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో అధికారికంగా దూరమయ్యారు. ‘ మా మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయి. ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉంది. 2024 జూలై 2 నుంచే తాము విడివిడిగా జీవిస్తున్నాం’ అని హన్సిక తరపు అడ్వకేట్‌ కోర్టుకు వెల్లడించారు.

భరణం విషయంలో సంచలన నిర్ణయం..

ఇవి కూడా చదవండి

కాగా విడాకుల కేసు విచారణ సమయంలో భర్త నుంచి ఎలాంటి భరణం అడగలేదు హన్సిక. కోర్టులోనూ ఈ విషయంలో ఎలాంటి వాదనలు జరగలేదు. కాగా ఛైల్ట్ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లో సినిమాలు చేసిన హన్సిక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ బ్యూటీగా తన అందంతో కుర్రకారను కట్టి పడేసింది. ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్, శింబు తదతర స్టార్ హీరోలతో సినిమాలు చేసింది హన్సిక. అయితే పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. చివరిగా 2024లో రిలీజైన గార్డియన్ అనే సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ.

హన్సిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

View this post on Instagram

A post shared by Hansika Motwanni (@ihansika)

స్నేహితురాలి భర్తనే పెళ్లాడి.. ఇప్పుడు విడాకులు..

హన్సిక- సోహైల్‌లది ప్రేమ వివాహం అని తెలిసిందే.  అయితే ఇది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. అంతుకు ముందే హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు వివాహమైంది.అయితే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత హన్సిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సొహైల్. ఇప్పుడు ఈ బంధం కూడా పెటాకులైంది.

View this post on Instagram

A post shared by Hansika Motwanni (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?