Cinema : రూ.6 కోట్లతో నిర్మిస్తే.. రూ.106 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ..
కంటెంట్ బలంగా ఉంటే చాలు థియేటర్లలో భారీ విజయాన్ని సాధించవచ్చు అనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. ఎలాంటి హడావిడి.. అధిక బడ్జెట్ లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అలాంటి జాబితాలోకి చెందినదే.

ఇటీవల చిన్న చిత్రాలు బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం హిందీలో విడుదలైన సైయారా సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. కానీ మీకు తెలుసా.. ఆ సినిమా కంటే ముందే ఒక రొమాంటిక్ మూవీ భారీ వసూళ్లు రాబ్టటి రికార్డ్ క్రియేట్ చేసింది. 2022లో విడుదలైన ఆ చిత్రాన్ని కేవలం రూ.6 కోట్లతో నిర్మించగా.. మొత్తం రూ.106 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు అమలులో ఉన్న సమయంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా పేరు లవ్ టుడే. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో రంగనాథన్, ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో విలక్షణ నటుడు సత్యరాజ్ ఇవానా తండ్రి పాత్రలో నటించారు. ఆయన పాత్రతో సినిమా కథ అసలు మలుపు తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
“లవ్ టుడే” సినిమాకు IMDb రేటింగ్ 8 ఉంది. ఇది 2022 లో టాప్ తమిళ చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో అందుబాటులో ఉంది. అంతేకాదు.. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో భారీ విజయాన్ని సాధించిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
“లవ్ టుడే” కథ విక్రమ్, ఉమ అనే ఇద్దరు ప్రేమికులు ప్రేమలో పడటం గురించి చెబుతుంది. ఐటీ ప్రొఫెషనల్ అయిన విక్రమ్ తన స్నేహితురాలు ఉమను వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఉమ తండ్రి వారు వివాహం చేసుకునే ముందు ఒక షరతు పెడతాడు. ఉమ తండ్రి విక్రమ్, ఉమ తమ ఫోన్లను మార్చుకోవాలని కండీషన్ పెడతాడు. ఇద్దరూ అయిష్టంగానే ఈ షరతుకు అంగీకరిస్తారు. ఈ చిన్న షరతు వారి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. దీంతో ఇద్దరి జీవితాల్లో ఊహించని పరిస్థితులు వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం.. భావోద్వేగ మలుపులతో తిరుగుతుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..




