14 October 2025

43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అందం, అభినయంతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె వయసు 43 సంవత్సరాలు. అయినా తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. 

43 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, సన్నగా, మెరుపుతీగలా, ఉత్సాహంగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు శ్రియ శరణ్. 

వయసు పెరుగుతున్నప్పటికీ తన ఎనర్జీ లెవల్స్ కొనసాగించడానికి కారణం తన జీవనశైలి, తీసుకునే ఆహారమేనని ఇదివరకు అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది శ్రియా.

ఇటీవల తన ఫిట్నెస్, శక్తికి కారణమైన ఐదు రకాల సహజసిద్ధమైన ప్రోటీన్ ఆహారాల గురించి పలు విషయాలను అభిమానులతో కలిసి పంచుకుంది ఈ అందాల భామా.

రోజూ తన ఆహారంలో గుడ్లు ఉండేలా చూసుకుంటుందట. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా గుడ్ల ద్వారా లభిస్తాయని అంటుంది. 

కందిపప్పు, పెసరపప్పు, శనగలు వంటివి మొక్కల ఆధారిత ప్రోటీన్‌ ఉంటుందని.. అలాగే వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయట. 

బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటివి ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తాయని అంటుంది.

అలాగే మాంసాహారం తీసుకునేవారికి లీన్ ప్రోటీన్ కు చికెన్, ఓమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ తో కూడిన ప్రోటీన్ కు చేపలు అద్భుతమైన ఎంపికలు అని అంటుంది శ్రియా.