AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్‌కు భార్యగా, మహేష్ బాబుకు విలన్‌గా నటించిన ఏకైక తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడేం చేస్తుందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు. ఈ హీరోలకు అభిమాన గణం కూడా ఎక్కువే. ఈ ఇద్దరి స్టార్స్ తో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

పవన్ కళ్యాణ్‌కు భార్యగా, మహేష్ బాబుకు విలన్‌గా నటించిన ఏకైక తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడేం చేస్తుందంటే?
Pawan Kalyan, Mahesh Babu
Basha Shek
|

Updated on: Oct 13, 2025 | 8:03 PM

Share

ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మరో సినిమాలో అదే హీరోకు లేదా మరో హీరోకు చెల్లెలిగా, అక్కగా, చెల్లిగా నటింవచచ్చు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్‌ కు భార్యగా, మహేష్ బాబుకు విలన్ గా నటించింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబులతో నటించేందుకు స్టార్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరు హీరోలు ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దేవయాని, కీర్తి రెడ్డి, భూమిక, అమీషా పటేల్, శ్రియ, ఇలియానా, త్రిష, శ్రుతి హాసన్, తమన్నా, సమంత, ప్రణీత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్ తదితర తారలు పవన్ కల్యాణ్‌, మహేష్ లిద్దరితోనూ రొమాన్స్ చేశారు. అయితే ఇందులో ఒక హీరోయిన్ మాత్రం పవన్ కు ప్రియురాలిగా, భార్యగా నటించి మరో సినిమాలో మహేష్ బాబుకు విలన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ అందాల తార రాశి.

పవన్ కల్యాణ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమా గోకులంలో సీత. ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో రాశి పవన్ ప్రియురాలిగా నటించింది. 1997లో రిలీజైన గోకులంలో సీత సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రాశి. అయితే 2003లో రిలీజైన మహేష్ బాబు సినిమా నిజం లో కూడా రాశి కీలక పాత్ర పోషించింది. మెయిన్ విలన్ గోపీచంద్ పక్కనే ఉంటూ మహేష్ ను హింసించ పాత్రలో అద్బుతంగా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. మహేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

సినిమా ప్రమోషన్లలో నటి రాశి..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది. సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ఉసురే అనే సినిమాలో నటించిన ఈ అందాల తార గిరిజ కళ్యాణం, జానకి కనగనలేదు సీరియల్స్‌ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.

గోకులంలో సీత సినిమాలో పవన్ కల్యాణ్, రాశి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి