OTT Movie: ఓటీటీలోకి కాంతార ఛాప్టర్ 1! రిషభ్ శెట్టి బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార ఛాప్టర్ 1. దసరా కానుకగా రిలీజైన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ ఈ మూవీ థియటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతారా చాప్టర్ 1’ కలెక్షన్ల పరుగు ఆగడం లేదు. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సినిమా రిలీజై మూడు వారాలు గడిచినా కాంతార ప్రభంజనం ఆగడం లేదు. ఇప్పటికీ చాలా చోట్ల ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. దీపావళికి నాలుగు సినిమాలు రిలీజైనా కాంతార జోరు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 125 కోట్లకు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేలా చర్చలు జరిగాయని సమాచారం. అన్నీ కుదిరితే అక్టోబర్ 30న లేదా నవంబర్ మొదటి వారంలో కాంతారా ఛాప్టర్ 1 సినిమా ఓటీటీలోకి రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం రూమర్ మాత్రమే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన కాంతార ఛాప్టర్ 1 సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరామ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమకు స్వరాలు అందించారు. కాగా ఐఎమ్ డీబీలో కాంతారా ఛాప్టర్ 1 సినిమాకు ఏకంగా 8.6/10 రేటింగ్ ఉండడం విశేషం. కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా కాంతారా ఛాప్టర్ 1 రికార్డుల కెక్కింది. యశ్ నటించిన కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది.
ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు..
Kerala ❤️🔥
Day 18 of #KantaraChapter1 in cinemas. Housefulls of devotion, housefulls of joy continue everywhere 🙏#KantaraInCinemasNow #BlockbusterKantara #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG… pic.twitter.com/2Q7hFhxo0n
— Kantara – A Legend (@KantaraFilm) October 19, 2025
కాగా కాంతారా: చాప్టర్ 1′ సినిమాను ఒక రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు రిషభ్ శెట్టి సినిమా చాలా దగ్గరంలో ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఛావా’ ప్రపంచవ్యాప్తంగా రూ. 830 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ సినిమాను అధిగమించే దిశగా కాంతార పరుగులు పెడుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








