Cinema : థియేటర్లలో దుమ్మురేపింది.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో నంబర్ 1.. ఆద్యంతం కట్టిపడేసే క్రైమ్ థ్రిల్లర్..
2025లో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. దాదాపు 2 గంటల 34 నిమిషాలు ఉన్న ఈ మూవీ మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు మీ మనసులను కదిలిస్తాయి.

ప్రస్తుతం ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తుంది. డిజిటల్ వేదికపై విడుదలైన వెంటనే ట్రెండింగ్ జాబితాలో ఇది చోటు సంపాదించుకుంది. ఈ చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకు యాక్షన్, సస్పెన్స్‌తో నిండి ఉంది. ఈ చిత్రం IMDbలో అద్భుతమైన రేటింగ్‌లను పొందింది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు హిట్ 3 అదే ‘హిట్: ది థర్డ్ కేస్’. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. అడివి శేష్, టిస్కా చోప్రా, రావు రమేష్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్రలో నటించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ హీరోగా నాని అదరగొట్టారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
కథ విషయానికి వస్తే.. ఈ కథ అర్జున్ సర్కార్ (నాని) అనే చురుకైన మనస్తత్వం కలిగిన పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. కాశ్మీర్‌లో అతడు ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక దారుణ హత్య జరుగుతుంది. అర్జున్ కేసును పరిష్కరించే బాధ్యతను తీసుకుని హంతకుడిని పట్టుకుంటాడు, కానీ అక్కడే కథ ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో ఇలాంటి హత్య జరిగిందని అర్జున్ సర్కార్ తెలుసుకుంటాడు. హత్యల విధానం ఒకేలా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ హత్యల వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి తన ప్రాణాలకు మించి రిస్క్ చేస్తాడు అర్జున్. తర్వాత ఏం జరిగిందనేది సినిమా. దాదాపు 2 గంటల 34 నిమిషాల పాటు, ఈ సినిమా మిమ్మల్ని రెప్ప వేయనివ్వదు. చివరి 30 నిమిషాలు తీవ్రమైన యాక్షన్ తో నిండి ఉంటాయి.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం దేశంలోని టాప్ 10 జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన “HIT: ది థర్డ్ కేస్” ప్రపంచవ్యాప్తంగా రూ.119 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి IMDb లో 10 కి 7.2 రేటింగ్ లభించింది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




