AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR- Nithiin: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ.. కట్ చేస్తే నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్.. ఏ సినిమానో తెలుసా?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ ఈ మధ్యన వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. 2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేదీ యూత్ స్టార్. దీని తర్వాత ఆరేడు, సినిమాలు చేశాడు నితిన్. కానీ సరైన విజయం అందుకోలేకపోయాడు.

Jr NTR- Nithiin: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ.. కట్ చేస్తే నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్.. ఏ సినిమానో తెలుసా?
Jr NTR, Nithiin
Basha Shek
|

Updated on: Oct 17, 2025 | 9:52 PM

Share

ఒక హీరో దగ్గరకు వచ్చిన సినిమా మరో హీరో దగ్గరకు వెళ్లడం సినిమా ఇండస్ట్రీలో సాధారణమే. అందుకు చాలా కారణాలున్నాయి. ఒక సినిమా ఎంపికలో చాలా ఈక్వెషన్స్ ఉంటాయి. హీరోలు కూడా వీటి ఆధారంగానే తమ సినిమాలను ఎంపిక చేసుకుంటారు. తమ కు సూట్ అవ్వకపోని కథలను మొహమాటం లేకుండా వద్దంటారు.అలా ఒక హీరో వద్దనుకున్న సినిమా కథలు వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవ్వొచ్చు. మరోసారి ఫ్లాప్ అవ్వచ్చు. అలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. తన దగ్గరకు వచ్చిన చాలా కథలను రిజెక్ట్ చేశాడు. ఇందులో కొన్నింటినీ వేరే హీరోలు తీసి హిట్ అందుకుంటే ఇంకొందరు పరాజయాలు చవి చూశారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా కథ కూడా నితిన్ దగ్గరకు వెళ్లింది. కట్ చేస్తే.. భారీ ఫ్లాప్ నుంచి ఎన్టీఆర్ తప్పించుకున్నాడు. అదే సమయంలో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

‘శతమానం భవతి’ తో జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. దీని తర్వాత శ్రీనివాస కల్యాణం అనే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. ఇందులో హీరోగా నితిన్ నటిస్తే హీరోయిన్ గా రాశీ ఖన్నా కనిపించింది. 2018లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఎన్టీఆర్ కోసమే ‘శ్రీనివాస కళ్యాణం’ అనే కథను డిజైన్ చేసుకున్నాడట దర్శకుడు సతీష్ వేగేశ్న. కథ కూడా ఎన్టీఆర్ కు వినిపించాడట. తారక్ కు కూడా బాగా నచ్చేసిందట. అయతే అప్పటికే ఎన్టీఆర్ సినిమా డైరీ ఫుల్ అయిపోయిదంట. కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల శ్రీనివాస కల్యాణం సినిమాను హోల్డ్ లో పడే పరిస్థితి వచ్చింది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను నితిన్ నో చేద్దామని చెప్పారట. అయితే ఈ నిర్ణయం బెడిసి కొట్టింది. శ్రీనివాస కల్యాణ్ం కథ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే లోపం కారణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది.

ఇవి కూడా చదవండి

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్..

View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.