AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1200తో ముంబైకి.. పొట్టకూటి కోసం టెలిఫోన్ బూత్‌లో పని.. ఇప్పుడు 300 కోట్లకు యజమాని.. ఈ హీరో ఎవరంటే?

ఇతని చిన్న వయసులోనే తండ్రి కన్నుమూశాడు. దీంతో పొట్టకూటి కోసం చిన్నప్పుడే రెక్కలు ముక్కలు చేసుకోక తప్పలేదు. క్లాత్ మిల్లులో వర్కర్ గా చేశాడు. ఫోన్ బూత్, ఇంకా కూల్ డ్రింక్ షాపుల్లో చిన్న చిన్న పనులు చేశాడు. కానీ ఇప్పుడు అతను..

1200తో ముంబైకి.. పొట్టకూటి కోసం టెలిఫోన్ బూత్‌లో పని.. ఇప్పుడు 300 కోట్లకు యజమాని.. ఈ హీరో ఎవరంటే?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Oct 15, 2025 | 5:06 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత స్టార్స్ గా వెలుగొందుతోన్న వారు గతంలో చిన్న చిన్న పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం ఏవేవో ఉద్యోగాలు చేసిన వారే. ఈ సూపర్ స్టార్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. తండ్రి ఓ సాధారణ కానిస్టేబుల్. కానీ ఈ నటుడు ఇంకా చిన్నతనంలో ఉండగానే ఆయన క్యాన్సర్ తో కన్నుమూశాడు. దీంతో చిన్న తనంలోనే కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకోవాల్సి వచ్చింది. అలాగనీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. పుట్టిన ఊరులోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత కమర్షియల్ ఆర్ట్స్, కంప్యూటర్స్ కూడ చదివాడు. అదే సమయంలో నటనపై ఆసక్తి ఉండడంతో తన కలలను నెరవేర్చుకోవడానికి ముంబైకి బయలుదేరాడు.అలా రూ.1200 తో ముంబై మహా నగరంలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు సూపర్ స్టార్ గా మారిపోయాడు. తన ప్రతిభతో ఏకంగా 300 కోట్లకు యజమాని అయ్యాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ కామెడీ కింగ్, హోస్ట్, నటుడు కపిల్ శర్మ.

ఇవి కూడా చదవండి

కాగా ఎన్నో ఆశలతో ముంబైకు వచ్చిన కపిల్ కు మొదట ఎలాంటి పని దొరకలేదు. దీంతో అమృత్‌సర్‌కు తిరిగి వచ్చి ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ కోసం ఆడిషన్‌ కు హాజరయ్యారు. కానీ అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురైంది. దీంతో మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఆడిషన్‌కు హాజరయ్యాడు. షో విజేతగా నిలిచాడు. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఈ షో ద్వారా వచ్చిన డబ్బుతోనే తన సోదరి వివాహం చేశాడు కపిల్. ‘K9’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన కపిల్ తన పేరుమీదగానే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే షోను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ది కపిల్ శర్మ షో’ను స్టార్ట్ చేశాడు. హోస్ట్ గా, నిర్మాతగా సత్తా చాటిన కపిల్ 2015లో ‘కిస్ కిస్ కో ప్యార్ కరూన్’ చిత్రంలో కూడా పనిచేశాడు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగానూ యాక్ట్ చేశాడు.

మిరాయ్ యూనిట్ తో కపిల్  శర్మ..

కాగా కపిల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.330 కోట్లని తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు వోల్వో XC90, మెర్సిడెస్ బెంజ్ S350 CDI వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కపిల్ ఏటా రూ.15 కోట్ల పన్ను చెల్లిస్తారు. పంజాబ్‌లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన ఫామ్‌హౌస్, ముంబైలో రూ.15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కూడా కపిల్ కు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..